పుట:Andhra bhasha charitramu part 1.pdf/762

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శుక, శృగాల, ప్రకృతి, ప్రాయ, గోత్ర, సమ, విషమ, ద్విద్రోణ, పంచక, సాహస్ర, ప్రతి, పరి అను ఇవి గూడ కడారాదులలో జేరినవి.

(21) 'కుమార' అను పదము 'శ్రమణా' మొదలగు పదములతో సమసించును. శ్రమణా, ప్రవ్రజితా, కులటా, గర్భిణీ, తాపసీ, దాసీ, బంధకీ, అధ్యాపక, అభిరూపక, పండిత, మృదు, కుశల, చపల, నిపుణ - ఈ పదములు శ్రమణాదులు. కుమార శబ్దము వీనిలోని స్త్రీలింగపదములతో సమసించి నప్పుడు వైకల్పికముగ స్త్రీలింగరూపముతోడను, పుంలింగ పదములతోను సమసించునపుడు పుంలింగరూపముతోడను బ్రయోగింపబడవలెను: ఉదా. కుమారీశ్రమణ, కుమారశ్రమణ; కుమారపండితుడు మొదలైనవి.

(22) చతుష్పాజ్జంతు వాచకపదము గర్భిణీ పదముతో సమసించును. ఉదా. గోగర్భిణి, అజాగర్భిణి మొదలయినవి. చతుష్పాజ్జంతువాచక పదమనుటచే 'బ్రాహ్మణీ గర్భిణీ' అను సమాసము కలుగదు.

(23) 'మయూరవ్యంసక' మొదలగునవియు కర్మధారయసమాసములగును. మయూరవ్యంసక, ఛాత్రవ్యంసక, కంబోజముండ, యవనముండ, హస్తేగృహ్య (హస్తగృహ్య - వేదములో), పాదే (- ద) గృహ్య, లాంగూలే (-ల)గృహ్య, పునర్దాయ - ఇవి మయూరవ్యంసకాదులు. ఇవి యన్నియు నిపాతములు.

ఉదక్చ అవాక్చ 'ఉచ్చావచమ్‌' = తె. ఉచ్చావచము; నిశ్చితంచ ప్రచితంచ = 'నిశ్చప్రచమ్‌', తె. నిశ్చప్రచము, నాస్తి కించన యస్య = 'అకించన:', తె. అకించనుడు; నాస్తికుతోభయం యస్య = 'అకుతోభయ:', తె. అకుతోభయుడు. అన్యోరాజా = 'రాజాంతరమ్‌', తె. రాజాంతరము; చిత్‌ఏవ = చిన్మాత్రం, తె. చిన్మాత్రము.

క్రియాసాతత్యమున, అనగా ఒకక్రియ యెడతెగక జరుగుచున్నదను నర్థమున నొక క్రియాపదము మఱియొక క్రియాపదముతో సమసించి తత్పురుష సమాసమగును. అశ్నీతపిబతా = 'తినుడు, త్రాగుడు' అను మాటలు పుట్టుచున్నవిందు; పచతభృజ్జతా = 'వండుడు, వేయించుడు' అను మాటలు పుట్టునట్టి విందువంట; ఖాదత - మోదతా = 'తినుడు, సంతోషింపుడు' అను మాటలు గలవిందు; ఖాదతవమతా = తినుడు, క్రక్కుడు అనుమాటలు గలవిందు; ఖాదతాచామతా = 'తినుడు, అచమింపుడు' అను మాటలుగల విందు; అహర నివయా; అహర నిష్కరా; భింధి లవణా = పగుల గొట్టుము, చీల్చుము, అను మాటలు గలది; కృంధివిచక్షణా; పచలవణా = వండుము, చీల్చుము, అనుమాటలు గలది; పచ ప్రకూటా; - ఇది