పుట:Andhra bhasha charitramu part 1.pdf/759

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(5) విశేషణము విశేష్యముతో సమానవిభక్తియం దుండి బహులముగా సమసించును: ఉదా. నీలోత్పలము, రక్తోత్పలము. బహులమనుటచేత గొన్నిచోట్ల నీవిధి నిత్యము: ఉదా. కృష్ణసర్పము; కొన్నిచోట్ల గలుగదు: ఉదా. రాముడు జామదగ్న్యుడు; తక్షకుడను సర్పము మొదలయినవి.

(6) పూర్వ, అపర, ప్రథమ, చరమ, ఉజఘన్య, సమాన, మధ్య, మధ్యమ, వీర అనుపదములును తమతో సమానవిభక్తియందున్న పదములతో సమసించును. ఇది నియమసూత్రము. పై పదము లెప్పుడును సమాసమున బూర్వపదములుగనే యుండవలెనని యీ సూత్రము నియమించు చున్నది: ఉదా. పూర్వవైయాకరణుడు, అపరాధ్యాపకుడు మొదలయినవి.

అర్ధశబ్దముతో సమసించునప్పుడు 'అపర' అను పదమునకు బదులుగా 'పశ్చ' అను పదము వాడబడును: పశ్చార్థము.

(7) 'శ్రేణి' మొదలగు పదములు 'కృత' మొదలగు పదములతో సమానవిభక్త్యంతములై సమసించును.

శ్రేణి, ఏక, పూగ, ముకుంద, రాశి, నిచయ, విషయ, నిధన, పర, ఇంద్ర, దేవ, ముండ, భూత, శ్రమణ, వదాన్య, అధ్యాపక, అభిరూపక, బ్రాహ్మణ, క్షత్రియ, (విశిష్ట), పటు, పండిత, కుశల, చపల, నిపుణ, కృపణ - ఇవి శ్రేణ్యాదులు.

కృత, మిత, మత, భూత, ఉక్త, (యుక్త), సమాజ్ఞాత, సమామ్నాత, సమాఖ్యాత, సంభావిత, (సంసేవిత), అవధారిత, అవకల్పిత, నిరాకృత, ఉపకృత, ఉపాకృత, (దృష్ట), కలిత, దలిత, ఉదాహృత, విశ్రుత, ఉదిత మొదలయినవి కృతాదులు. ఇది యాకృతిగణము గావుననిట్టి వింకను గలవని తెలియవలెను.

ఉదా. శ్రేణీకృతము మొదలయినవి.

(8) నఞ్‌తోచేరని క్తాంతపదము నఞ్‌తో జేరిన క్తాంతపదములతో సమానవిభక్తియందుండి సమసించును: ఉదా. కృతాకృతము, అశితా నశితము, క్లిష్టాక్లిశితము.

(9) 'శాకపార్ధివ' మొదలగు సమాసములందు ఉత్తరపదలోపము కలుగునని చెప్పవలెను; శాకప్రియుడగు పార్థివుడు 'శాకపార్థివుడు' = తన శకమువారికి ప్రియుడయి శకమును గల్పించువాడు; దేవపూజకుడగు బ్రాహ్మణుడు 'దేవబ్రాహ్మణుడు', మొదలయినవి.

శాకపార్థివ, కుతపశౌశ్రుత = కుతపకాలమును జూచికొని యాతిథ్యము కొఱకు వచ్చువాడు; అజాతౌల్వలి = మేకపాలను త్రాగి బ్రతుకుఋషి-