పుట:Andhra bhasha charitramu part 1.pdf/757

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంఖ్యావాచకములతో తద్ధితార్థమున సమాసముకలిగినందుకు, షాణ్మోకురుడు.

'పంచగావో ధనం యస్య' అయిదుగోవులు ధనముగా ఎవనికి గలవో వాడు అనుదానిని బహువ్రీహి సమాసము చేయక, పూర్వము 'పంచ + గో' అను పదములకు సమాసము కల్పించవలెను. ఇట్లుండగా, -

(13) తత్పురుష సమాసమున ద్వితీయాంగముగా నిలిచిన గోశబ్దమునకు, తద్ధితప్రత్యయమునకు లోపము కలుగకుండినచో, 'టచ్‌' ప్రత్యమగును. అప్పుడు 'పంచ + గో' అనునది 'పంచగవ: అను తత్పురుష సమాసమగును. తరువాత నా సమాసముపై 'ధన' శబ్దముచేరి 'పంచగవధన:' = పంచగవధనుడు అను బహువ్రీహిసమాసమగును.

'పంచ + గో' అను పదములను తత్పురుషసమాసము చేయనియెడల 'టచ్‌' రాదు. అప్పుడా పదములపై 'ధన' శబ్దముచేరి 'పంచగోధన:' = పంచగోధనుడు, అనియే సమాసమగును.

(ఆ) కర్మధారయసమాసము.

ఇంతవఱకును వ్యధికరణ తత్పురుషము వివరింపబడినది. తత్పురుషమున సమానాధికరణమను రెండవ భేదమునకు గర్మధారయ మనిపేరు. ఇదియును ఉత్తరపదము నర్థము ప్రథానముగాగలదియే. ఇందు విశేషణ విశేష్య పదములు కలిసి సమాసములగును; కొన్నియెడల రెండుపదములును విశేషణములే కావచ్చును. ఈ సమాసమునందలి రెండుపదములును మాత్రము ఒక్కవిభక్తియందే యుండును. ఇందలి విశేషణములకు సంభావన, ఉపమానము, మొదలగు నర్థములు గలిగి కర్మధారయమందు కొన్నిభేదములు గలుగును.

i. ద్విగుసమాసము.

కర్మధారయసమాసమందు సంఖ్యావాచకపదము పూర్వపదమైన యెదల దానికి ద్విగువను పేరు గలుగును, ద్విగుసమాసమ (1) తద్ధితార్థగువు (2)ద్విపపదద్విగువు (3) సమాహారద్విగువు అని మూడువిధములుగా నుండును. ఉదా. (1) తద్ధితార్థద్విగువు: దశక పాలము = పదిపాత్రలయందు చేయబడిన బలిపదార్థము; (2) ఉపపదద్విగువు: సమాసముపై మఱియొక పదముచేరుట: పంచనావప్రియుడు = అయిదునావలను కలిగియుండ నిష్టము గలవాడు. (3) సమాహారద్విగువు: పంచగవము = అయిదు గోవుల సమూహము.

(1) ఇందు సమాహార ద్విగుసమాస మేకవచనమునందును నపుంసక లింగమునందును మాత్రముండును: పంచగవము = అయిదు గోవులసమూ