పుట:Andhra bhasha charitramu part 1.pdf/755

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యెగురుచుండును; అట్లే గురుకులమున జేరి యచట చిరకాలము నిలువక లేచిపోవువాడును తీర్థవాయస మనబడును.

(4) సప్తమ్యంతపదము ఋణార్థమున కృత్యప్రత్యయాంత పదములతో సమసించి సప్తమీ తత్పురుష సమాసమగును. ఈ సూత్రమునందలి కృత్యప్రత్యయము యతృ ప్రత్యయమునకు మాత్రము వర్తించును: ఉదా. మాసమున నివ్వవలసిన ఋణము = మాసదేయము, 'సాయాహ్నేగేయం నామ' అనుచో 'ఋణార్థము' లేదు కావున సమాసముకాదు.

(5) సప్తమ్యంతపదము మఱియొక విభక్త్యంతపదముతో గలిసి సంజ్ఞా వాచకమయి సప్తమీ తత్పురుష సమాసమగును. ఇట్టిచోట సప్తమీ ప్రత్యయమునకు లోపము గలుగదు: ఉదా. అరణ్యే తిలకా: = అడవి నువ్వులు.

(6) రాత్రియొక్కకాని, పగటియొక్కకాని భాగములను దెలుపుపదములు క్తాంతపదములతో సమసించి సప్తమీ తత్పురుష సమాసములగును. ఉదా. పూర్వాహ్ణక్ర్తము, అపరాహ్ణకృతము, అపరాత్రకృతము మొదలైనవి.

(7) 'తత్ర' అనుపదము సప్తమ్యంతము: అది క్తాంతపదముతో గలిసి సప్తమీతత్పురుష సమాసమగును. ఉదా. తత్రభుక్తము.

(8) సప్తమ్యంతపదము నిందార్థమున క్తాంతపదముతో సమసించి సప్తమీ తత్పురుష సమాసమగును: ఉదా. ఈ నీపని అవతప్తే నకులస్థితమువలె నున్నది; ఈ మాట చపలమనస్సుగల వానినిగూర్చి చెప్పబడును.

(9) 'పాత్రేసమిత' మొదలగు పదములు నిందార్థమున సప్తమీ తత్పురుష సమాసములగును. పాత్రే సమితులు, పాత్రేబహులులు = తిండివేళకు సిద్ధమగువారు; ఉదుంబరమశకము, ఉదుంబరకృమి, కూపకచ్ఛపము, అవటకచ్ఛపము, కూపమండూకము, కుంభమండూకము, ఉదాపానమండూకము = తానున్నదేలోక మనుకొనువాడు; నగరకాకము, నగరవాయసము = పట్టణములలో పనిపాటులు లేక తిరుగువాడు; మాతరిపురుషుడు = అమ్మకూచి; పిండీశూరుడు = తిండికిశూరుడు; పితరిశూరుడు = తండ్రిమీద శూరత్వము చూపువాడు; గేహేశూరుడు = ఇంటిలోమాత్రము శూరుడు; గేహేనర్ధి, గేహేక్ష్వేడి = ఇంటకేకలు వేయువాడు; గేహేవిజితి = ఇంటిలోగెలిచినానని చెప్పుకొనువాడు; గేహేవ్యాడుడు = ఇంటిలో పామువంటివాడు; గేహే మేహి, గేహేదృప్తుడు, గేహేధృష్టుడు = ఇంట గర్వించువాడు; గేహేతృప్తుడు = ఇంటికూచి; ఆఖునిక బకము = ఎలుకమీదికి కొంగవంటివాడు, అనగా తనకంటె చిన్నవారిమీదికి శూరుడు; గోష్ఠేశూరుడు = ఆవులసాలలో శూరుడు, గోష్ఠేవిజితి = ఆవులసాలలో జయించువాడు; ఇట్లే, గోష్ఠే