పుట:Andhra bhasha charitramu part 1.pdf/754

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సమసించి, షష్ఠీతత్పురుష సమాసములగును: ఉదా. కాయమునకు పూర్వము = పూర్వకాయము; కాయమునకు అపరిము = అపర కాయము.

(12) 'అర్ధము' అనుపదము 'సరిగా సగము' అనునర్థము గలిగియున్నప్పుడు నపుంసకలింగ మగును. అట్టి 'అర్ధము' అను పదము సమభాగములుగల వస్తువును దెలుపు పదముతో (ఆ సమభాగములుగల వస్తువు సంపూర్ణవస్తువయినప్పుడు) సమసించి షష్ఠీతత్పురుష సమాసమగును: ఉదా. పిప్పిలితో అర్ధము = అర్ధపిప్పిలి.

(13) ద్వితీయ, తృతీయ, చతుర్థ, తుర్య, అను పదములు భాగములు గలిగిన సంపూర్ణవస్తువును దెలుపు పదముతో వైకల్పికముగా సమసించును: ఉదా. భిక్షయొక్క ద్వితీయము = ద్వితీయభిక్ష.

(14) 'ప్రాప్త, ఆపన్న, అనుపదములు ద్వితీయాంతపదములతో గూడ వైకల్పికముగ సమసించును: ఉదా. ప్రాప్తజీవికుడు, జీవికాప్రాప్తుడు; ఆపన్న జీవికుడు, జీవికాపన్నుడు.

(15) కాలవాచకపదములు తత్పరిమాణవాచక పదములతో గలిసి అహష్ఠీతత్పురుష సమాసములగును: ఉదా. జాతోమాసన్య = మాసజాత:, తెనుగు: మానజాతుడు; ద్వ్యహ్నో జాతస్య యస్య = ద్వ్యహ్నజాత:, తెనుగు; ద్వ్యహ్న జాతుడు మొదలయినవి.

vi. సప్తమీతత్పురుషము.

(1) సప్తమ్యంతపదము శౌండాదిపదములతో గలిసి సప్తమీతత్పురుష సమాసమగును: శౌండ, ధూర్త, కితవ, వ్యాడ, ప్రవీణ, సంవీత, అంతర (స్థలవాచకమయినప్పుడు), అధి, పటు (అధిపటు), పండిత, కుశల, చపల, నిపుణ, సంవ్యాడ, భవ్య, సమీర - ఇవి శౌండాదులు. ఉదా. అక్షము లందు శౌండుడు = అక్షశౌండుడు మొదలయినవి.

(2) అట్లే, సప్తమ్యంతపదము 'సిద్ధ, శుష్క, పక్వ, బంధ,' శబ్దములతో గూడ సమసించి సప్తమీతత్పురుష సమాసమగును: ఉదా. సాంకాస్యమునందు సిద్ధుడు = సాంకాస్యసిద్ధుడు; ఆతపమునందు శుష్కము = ఆతపశుష్కము; స్థాలియందు వండబడినది = స్థాలీపక్వము; చక్రమునందు కట్టబడినది = చక్రబంధము,

(3) సప్తమ్యంతపదము నిందార్థమున ధ్వాంక్ష శబ్దముతో గలిసి సప్తమీతత్పురుష సమాసమగును: తీర్థమునందు ధ్వాంక్షము = (కాకము, వాయసము) తీర్థధ్వాంక్షము = నీటికాకి (నీటికానులకొఱకు నది ఒడ్డున కాచుకొనియుండువాడు); లేదా, కాకి, నీటియొడ్డున నిలుకడగా నొకచోట నిలువక