పుట:Andhra bhasha charitramu part 1.pdf/739

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేకార్థీభావసామర్థ్యము గల పదముల సమాసములకే సమాససంజ్ఞను వైయాకరణు లంగీకరించి యున్నారు.

తెనుగున సమాసములు (1) సాంస్కృతికములు (2) ఆచ్ఛికములు (3) మిశ్రములు - అని మూడువిధములుగ నుండును. అందు సాంస్కృతిక సమాసములు (i)సిద్ధములు (ii) సాధ్యములు అని రెండువిధములు. సంస్కృతమునం దేర్పడిన సమాసములకే తెనుగున దత్తత్ప్రత్యయములు చేరగా గలిగినవి సిద్ధసాంస్కృతిక సమాసములు. సంస్కృతపదములు తత్సమములై సమసించినయెడల నట్టి సమాసములు సాధ్యసాంస్కృతిక సమాసము లనబడును. తద్భవ, దేశ్యపదములలో నేవియైనను గలిసి యేర్పడిన సమాసము లాచ్ఛికములు; అనగా నిట్టిసమాసములందలి పదములన్నియు దేశ్యము లయికాని, అన్నియు దద్భవము లయికాని, తద్భవదేశ్యపదములు కలిసికాని యుండవచ్చును. మిశ్రసమాసమందు సంస్కృతసమపదములతో నాచ్ఛిక పదములు చేరును.

(1) i. సిద్ధసాంస్కృతిక సమాసములు - విశ్వచిద్యాలయము, ఆంధ్ర భాషాచరిత్రము, ఆనందముద్రాశాల, రాధాకృష్ణులు.

ii.సాధ్యసాంస్కృతికములు: నదిజలము, జనకునాజ్ఞ, రాముని భార్య.

(2) ఆచ్ఛికసమాసములు - i. కేవల తద్భవపదములు (అర్వాచీన తద్భవములు) చేరినవి. అంచరవుతు, బంగారుకంటె.

ii. కేవలదేశ్యములు (ప్రాచీనతద్భవములు) చేరినవి - కనువినికి, కాయగూరలు.

iii. తద్భవదేశ్యములు కలిసినవి - చెఱువునీరు, సిరిచెలువుడు, తెల్లగాడిద.

(3) మిశ్రసమాసములు: మంచిరాజు, నల్లయశ్వము, సిరివిభుడు.

(1) i. సిద్ధసాంస్కృతిక సమాసములు.

సిద్ధసాంస్కృతిక సమాసములనుగూర్చి సాధారణముగ దెనుగు వ్యాకరణములందు చెప్పు నాచారము లేదు. కాని, తెనుగు గ్రంథములందు సంస్కృత సమాసజ్ఞానములేనిదే జరుగదు. సంస్కృతవ్యాకరణము నభ్యసించినగాని యాజ్ఞాన మలవడదు. సంస్కృత సమాసముల నన్నిటిని దెనుగున విభక్త్యాది ప్రత్యయములనుజేర్చి యుపయోగింపవచ్చునను నొక యభిప్రాయము గలదు. ఇదితప్పు. సంస్కృతమునందలి సమాసములనన్నిటి నున్న వున్నట్లుగాని, తదర్థబోధక ప్రత్యయాదులనుజేర్చి కాని, ప్రయోగింప వీలులేదు. సంస్కృతసమాసములలో గొన్నివిధములు మాత్రము తెనుగున