పుట:Andhra bhasha charitramu part 1.pdf/738

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆఱవ ప్రకరణము.

సమాస ప్రకరణము.

సంధిప్రకరణమున వర్ణవిధిని గూర్చిన నియమములు వివరింపబడినవి. సంస్కృతమున సజ్ఘల్లులలో నెవ్వియైన నవ్యవధానముగ నొకదానికొకటి పరమైనయెడల నేదియో యొకవిధమగుసంధి కలుగుచుండును. ఆ వర్ణములకుగాని, యా వర్ణములు గల పదములకుగాని యర్థవిషయమున నెట్టి సంబంధము నుండనక్కఱలేదు. ఉదా. "తిష్ఠతు దధ్యశానత్వం శాకేన." ఇచట 'దధి'యను పదమునకును 'అశాన' అను క్రియకును నర్థసంబంధము లేకున్నను సంధి కలుగుచున్నది. "తిష్ఠతు కుమారీచ్ఛత్రం హర దేవదత్తాత్." ఇచట 'కుమారీ' శబ్దమునకును "ఛత్ర" శబ్దమునకును నర్థసంబంధములేకున్నను సంధియందు 'తుక్కు' కలుగుచున్నది.

కాని, పదము లట్లర్థసంబంధములేకయే కలియవు. అవి యట్లు కలియుటకు సమర్థములై యుండవలెను; అనగా వాని కర్థసంబంధ ముండవలెను. ఎట్లన, "కష్టం శ్రిత:" (కష్టము నాశ్రయించినవాడు) అనుదానియందు 'కష్ట,' 'శ్రిత' శబ్దముల కర్థసంబంధముచే గలియుటకు సామర్థ్యము గలదు; కాబట్టి యవి సమసించి "కష్టశ్రిత:" అను ద్వితీయాతత్పురుషసమాస మేర్పడుచున్నది, కాని, "పశ్యదేవదత్త కష్టం, శ్రితో విష్ణుమిత్రో గురుకులమ్" అను వాక్యములందు "కష్టం, శ్రిత:" అను శబ్దముల కర్థసంబంధము లేకుండుటచే సమసించుటకు వానికి సామర్థ్యములేదు. కావుననే, "సమర్థంబులగు పదంబు లేకపదంబగుట సమాసం బనబడును" అని వైయాకరణులు నిర్వచింతురు.

సామర్థ్యము (1) వ్యపేక్షాసామర్థ్యము (2) ఏకార్థీభావసామర్థ్యము అని రెండువిధములు. రెండుపదములు సమసింప సమర్థములై యున్నను సమసింపక, అనగా రెండును గలిసి యేకపదముగాక వాక్యమున వేర్వేఱుగ నిలిచియున్నను నాకాంక్షచే వానిసంబంధము స్పష్టపడవచ్చును. 'రాజుయొక్క పురుషుడు' అనునప్పుడు 'రాజు' 'పురుషుడు' అను రెండుపదములును సమర్థములై యున్నను ఏకపదముగ సమసింపలేదు. "ఎవనిపురుషుడు" అని ప్రశ్నింపగా "రాజుయొక్క పురుషుడు" అను ప్రత్యుత్తరమునందు వానికి గల సంబంధము వ్యక్తమగుచున్నది. ఇట్టి సామర్థ్యమునకు వ్యపేక్షాసామర్థ్యమనిపేరు. కాని, యా రెండును సమసించి 'రాజపురుషుడు' అని యేకార్థీభావమును బొందుట యేకార్థీభావ సామర్థ్య మనబడును. సాధారణముగ