పుట:Andhra bhasha charitramu part 1.pdf/731

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


"తే-గీ. దేవతలభాష కావున దెనుగుకన్న
      సంస్కృతమె పెద్ద యని యండ్రు సరియె తెలిసె
      రసికు డగువాడు తనదుజాఱుసిగలోన
      దులసినే యిడుకొనునొ జాజులనె యిడునొ?"

యని తెనుంగుయొక్క పరిమళమును గొనియాడి యున్నాడు.

ఇట్లాయా భాషల యందలి కవులు స్వాభిమానముచే నెన్ని చెప్పినను బరభాషా పదములు తమమాటలతో గలియకపోవు. పై తెలగన్న పద్యములోనే యెనిమిది సంస్కృతపదములు మాఱువేషములతో దాగుడుపడి యున్నవి.

ఒక భాషనుండి మఱియొక భాషలోనికి వచ్చుపదములు చాలమట్టుకు నామపదములై యుండును. వర్తకవ్యాపారముల వలనను నితర సంబంధముల వలనను, నాయావస్తువుల పేళ్ళను మనము ముఖ్యముగ నెరవు తెచ్చుకొందుము. తరువాత వచ్చునవి క్రియలును విశేషణములును. ఎంతయో పరిచయమును మైత్రియు గలిగిన గాని సర్వనామములు, సంఖ్యావాచకములు, అవ్యయములు, ప్రత్యయములును నెరవు తెచ్చుకోబడవు. ఇవి భాషకు మూలములు; అనాయాసముగ మనస్సు నాకర్షింప వీని నుపయోగింతుము. అదియుగాక వీనికి నామరూపమించుక యైన లేదు. వీనిలో నొకవేళ నెంతయో యవసర మైనప్పుడు సర్వనామములు నామరూపము గొంతవఱకు గలిగి యుండుటచే నెరవు తెచ్చుకొనబడును. ప్రత్యయములు మాత్రము మఱియొక భాషయందు జొరబడుట యసంభవము కాకపోయినను నెంతయో పరిచయ ముండిన గాని జరుగుట దుర్లభము.

పై జెప్పబడిన రెండు విధములలోను శబ్దజాలమును వృద్ధిపఱుచుట కేమార్గము మంచిది యనువిచారము మనకు గలుగకపోదు. కొంద ఱితర భాషాపదముల మనభాషలోనికి జొప్పించి దానిని బాడుచేయు చున్నామని తలంపవచ్చును. కావలసిన యర్థమును సరిగ దెలిపినచో నొకపదముకంటె మఱియొకదాని యాధిక్యమెద్దియు లేదని మన మట్టివారికి బ్రత్యుత్తర మీయవచ్చును. క్రొత్తపదము ప్రాతపదమువలె నందఱకు గ్రాహ్యము కాకపోయినచో నది తప్పక నుపయోగమే. కాని యితరభాషాపదము మన భాషయందు నెలకొని యందఱకును బోధపడినచో స్వదేశపదము నదియును గూడ మంచివియే. స్వభాషాపదములనే సమాసము చేసి క్రొత్తమాట నేర్పఱిచినచో నది పరభాషాపదమువలె నందఱకును సుబోధము కాక పోయినపుడు స్వభాషాపద మనునాధిక్యము దానికి గలుగునే కలుగదు. అందుచేత దేశ్యపదముల సమాసమును నితర భాషాపదమును గూడ జనులవాడుకను బట్టి