పుట:Andhra bhasha charitramu part 1.pdf/727

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మడకశిర తాలూకా అంచులలో నూటికి 73 మందియు, కల్యాణదుర్గం తాలూకాలో 20'7 మందియు కలరు. మడకశిర తాలూకాలోని మొత్తము 62 గ్రామములలో 16 గ్రామములలో మాత్రమే కన్నడులు సగముమందికి పైగా నున్నారు. అట్లే కల్యాణదుర్గం తాలూకాలో 75 గ్రామములళొ 9 లో మాత్రమే సగము భాగమును, అంతకు పైబడియు కలరు. ఆ ప్రదేశములోని గ్రామనామములకే కన్నడపు వాసన గలదు. మధ్యదేశమున నెక్కడనైన కన్నడము పేరి గ్రామమున్నయెడల తర్వాత జనులు అక్కడకు వెళ్ళిచేరిరని తలంపవలెను.

ఇప్పుడు కనబడుచున్న గ్రామనామముల స్వరూపమునుబట్టి యీచర్చ చేయబడినది. కాని, వాఙ్మయములోను శాసనములలోను నీ పేరులను కనిపెట్టినచో లాభకరముగా నుండును. కాని, యీ వ్యాసములో దాని కంతటికిని చోటు చాలదు. అది వేఱుగ ప్రత్యేకమగు పరిశోధన కాగలదు. దానికి తగినన్ని ఆధారము లింకను లేవు. కావున ఉన్న అల్ప స్వల్పపు ఆధారములనే ఆశ్రయింప వలసియున్నది.

వాఙ్మయమునుండి తెలియునవి.

1. ఆరవీడు (తాడిపర్తి తాలూకా): తాత పిన్నమ కొడుకు సోమదేవుడు ఈ గ్రామమును పాలించుచుండినట్లు "రామతాజీయము" నుడువుచున్నది.

కుమార ధూర్జటి "కృష్ణరాయవిజయము"లో ఆర్వీటిబుక్కరాజు కృష్ణరాయని తూర్పుదండయాత్రకు సాహాయ్యకుడుగా వెళ్లిన ట్లున్నది.

2. ఆకులేడు (అనంతపురం తాలూకా): "రామరాజవిజయము"లో సోమదేవుని గురించిన 'ఆకులపాటి ... ... విజయలక్ష్మీ సమక్షీకరణ లక్షిత' అను సమాసములోని 'ఆకులపాడే' యీ ఆకులేడు గావచ్చును.

3. ముదిగల్లు (కల్యాణదుర్గం తాలూకా): ఈ కోటను పాలించినవారు విజయనగరరాజులను పలుమాఱు శ్రమపెట్టిరి. వారు దీనిని పలుమాఱు జయించిరి.

పై సోమదేవునికే 'ముదిగంటి ... ... విజయలక్ష్మీ సమక్షీకరణ లక్షిత' (రామరాజీయము) అనియు, 'ముదిగంటి వీరక్షేత్ర భారతీమల్ల' (కృష్ణరాయ విజయము) అనియు, బిరుదులు గలవు.

'ముదిగంటి దుర్గాధినాయకు'డను బిరుదు రామరాజునకు గలదు.

4. బుక్కరాయసముద్రం (అనంతపురం తాలూకా): నంద్యాల తాలూకాలో దేవరకొండయొద్ద చెఱువునకు తూర్పుభాగమున నీయూ రుండి న