పుట:Andhra bhasha charitramu part 1.pdf/723

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నరసాపురము ఇతనిపేరిటవచ్చినది. వానికొడుకు వేములనాయుడు. వేములపాడు ఇతని పేరిటనైనది. ఇతని కొడుకు ముసలప్పకు ఇద్దఱు కుమారులు. పెద్ద వేమలనాయుడు, చిన్ననాయుడు అనువారు. రాయదుర్గం పాళెయగారు ముసలి కోనేటినాయుడు. ఇతడు పెద్దవేమనను ఓడించి పాళ్యమును తన దాయాది తిమ్మానాయుని కిచ్చెను.

బ్రిటిష్‌వారు ఏ గ్రామమునకును తమపేరు నుంచలేదు. జనరంజకులైన కొందరు ఉద్యోగులపేర కొన్ని వీధులకును, ఇండ్లకును నామకరణము చేయబడినది. అనంతపురములో జార్జిపేట, రీడ్‌వీధి, గుత్తిలో మన్రోసత్రము ఇట్టివి.

దేశచరిత్ర పాలకుల జీవితములను బట్టియే రచింపబడుచుండుట యాచారమైనది. కాని గ్రామ నామధేయములను బట్టి చూచినచో పాలకులుగాకుండ జనులలో పేరుపెంపులు గలిగియుండిన మహనీయులెందఱో యుండిరనియు పాలకుల పేరులవలె అట్టివారి నామములుగూడ గ్రామముల పేరిట నిలిచిపోయినవనియు తెలియగలదు. పురుషులకేకాక స్త్రీలకుగూడ ఆ కీర్తి యబ్బినది. ఉదాహరణము:-

మలయనూరు, వంగనూరు, యెల్లనూరు, అప్పరాజుచెరువు, కేతగానిచెరువు, పంతులచెరువు, సోమనదొడ్డి, చెన్నరాయపట్నం, ఎల్లారెడ్డిపల్లి, కనిసెట్టిపల్లి, కరిగానపల్లి, కొడపగానిపల్లి, గణపతిపల్లి, గొందిరెడ్డిపల్లి, గోవిందపల్లి, గౌకానపల్లి, చందిరెడ్డిపల్లి, చినగానిపల్లి, చిన్న రామన్నగారిపల్లి, చెన్నరాయనిపల్లి, చెన్నే కొత్తపల్లి, తిప్పాభట్లపల్లి, తిప్పేపల్లి, దేమకేతపల్లి, నరసంభట్లపల్లి, నాగిరెడ్డిపల్లి, నారెపల్లి, నారేమడ్డిపల్లి, బసినేపల్లి, బీచగానిపల్లి, బీరేపల్లి, బుడ్డారెడ్డిపల్లి, బుడ్డేపల్లి, బుశ్యాగారిపల్లి, బూగానపల్లి, బేతపల్లి, పోతులనాగేపల్లి, పోలేపల్లి, మారెడ్డిపల్లి, మలిరెడ్డిపల్లి, ముద్దిరెడ్డిపల్లి, యజ్ఞశెట్టిపల్లి, లింగారెడ్డిపల్లి, వీరవాహనపల్లి, ఓబుళంపల్లి, వోబుళరెడ్డిపల్లి, సంకేపల్లి, ఆనందరావుపేట, చక్రాయపేట, జోగన్నపేట, సుబ్రావుపేట.

స్త్రీలపేరిట వచ్చిన నామములు:- అంకంపల్లి, ఆజంపల్లి, కోనంపల్లి, గంగంపల్లి, గంగాదేవిపల్లి, గోనేపల్లి, నరసంపల్లి, చెన్నంపల్లి, రాఘవంపల్లి, రాయంపల్లి, లక్ష్మంపల్లి, వంగంపల్లి, వెంకటంపల్లి, సోమందేవంపల్లి, అంకంపేట, పాపంపేట, సిద్ధంపేట.

మతముల పలుకుబడితో నేర్పడిన గ్రామనామములనుగుఱించి కొంత పరిశీలింతము. ఈ జిల్లాలో వ్యాపించిన మొదటిమతము బౌద్ధమతము. బుడ్డారెడ్డిపల్లి, బుడ్డేపల్లి, బొజ్జిరెడ్డిపల్లి, ఇవి బుద్ధునిపేరు బెట్టుకొన్నవారినుండి కలిగినవి. బుద్ధ అను పదమునకు వికృతులే 'బొజ్జ, బొజ్జి, అనునవి. ఈ గ్రామముల