పుట:Andhra bhasha charitramu part 1.pdf/717

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మావటూరు, దండువారిపల్లె, దబురువారిపల్లె, మంగలమడక, కుమ్మరమల, కుంబరమాగెనహళ్ళి.

18. కొన్ని కుటుంబనామములు:- మద్దివారిగొంద, మడుగువారిగొంద, సలకంచెరువు, గైదంవారిపల్లి, గౌనివారిపల్లి, చల్లావారిపల్లి, చిల్లవారిపల్లి, దాదుంవారిపల్లి, పెద్దనవారిపల్లి, మక్కినవారిపల్లి, ముక్కండ్లవారి కోటపల్లి, ముండ్లవారిపల్లి, సానివారిపల్లి. ఈ కుటుంబములవారు చాల ప్రసిద్ధిలో నుండిరి కాబోలు, కాని ఇప్పుడు వారిచరిత్ర వినుకడిలో లేదు. ఇందులో సలకంతిమ్మరాజు మాత్రము కృష్ణదేవరాయలమీద తిరుగబడిన సేనానులలో నొక్కడు.

19. ఈ మండలము నేలిన రాజుల వంశనామములు కొన్ని గ్రామముల కంటినవి.

ఇది తెలిసికొనుటకుముందు మండలచరిత్రమును కొంత ఎఱుగుట మంచిది.

పురాణకాలపు స్థలములు.

కల్యాణదుర్గమునకు మూడుమైళ్ల దూరములోనున్న ముదిగంటియందును ఆ పట్టణమునకు ఉత్తరముననున్న పెద్దగుట్టయగు దేవూదులబెట్టలోను వందలకొలది రాతికట్టడములతోడి గోరీలున్నవి. అనంతపురము తాలూకాలో మాల్యవంతమునకు ఉత్తరమున బాటప్రక్క అట్టివి నాల్గున్నవి. బుక్కరాయసముద్రమునకు పోవు త్రోవలో ముసలమ్మకట్టవద్దనున్న దిబ్బలో నొక్కటి యున్నది. హిందూపురము తాలూకాలోని కొండాపురం, పూలేరు గ్రామములలో నిట్టివే ఒక్కొక్కటి గలవు.

గుంతకల్లు రైల్వేస్టేషనునకు నైఋతిమూలనున్న మెట్టలో నొక్కటియగు విడపనకంటి కోటలో వేలుపుమడుగు గుట్టలలో, లత్తవరం కరకుముక్కల పడమటి కొండలో, వజ్రకరూరికి పడమటనున్న చిన్నగుట్టలో ఉరవకొండ కొండలో, దానికి తూర్పు గుట్టలో, వెలికొండ కొండలో, ప్రాచీన శిలాయుగమునకు ముందిటి మానవనివాస చిహ్నములు కాన్పించుచున్నవి.

బూదిహాల్ అని పిలువబడు బూదికొండలోగూడ అట్టి కృతయుగ మానవ నివాసచిహ్నము లున్నవని తెలియుచున్నది. బూది అనగా బూడిద. బూడిద అను పదముతో సంబంధముగల గ్రామము లీ జిల్లాలో మరికొన్ని కలవు. గుత్తి తాలూకాలో బూదిగవి, హిందూపురము తాలూకాలోని బూదిలి, అనంతపురము తాలూకాలో బూదూడు, కదిరి తాలూకాలోని బూదనంపల్లి, కల్యాణదుర్గం తాలూకాలోని బూదిగుమ్మ, పెనుగొండ