పుట:Andhra bhasha charitramu part 1.pdf/714

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. ముడి: సం. ధాతువు ముట్ = మడచు, చుట్టు, పెనగొను. 7-వ శతాబ్ది లోకనాథుని తిప్పేరదానశాసనములో 'కనామోటిక' అని యున్నది. ప్రాతబంగాలీలో కాణమోడియా. ఇప్పటి బంగాలీలో కాణమురి. అనంతపురములో కల్లుముడి.

10. వోలు: బంగాలీ: వోర, వోల, పోల = పొలము. 10-వ శతాబ్దపు దేవఖడ్గ తామ్రశాసనములో 'ఉగ్రవోరక' అని యున్నది.

11. పర్రు = పర్తి. సం. పాటక, వాటక. ఇది 'ప్రస్థ'లో నుండి పుట్టియుండవచ్చును - ఇంద్రప్రస్థ. ఉత్తరదేశములో గోల్‌పారా. అనంతపురములో 'పర్తి'తో ముగియు పేర్లు 8 ఉన్నవి. 'పత్రి' ముగియున దొక్కటి.

12. జూల: బంగాలీ - హిందీలో - ఝూల్, ఝూల్ = వంక. లేదా బంగాలీలోని జోడా.

హిందీ: జోడా = కవలు, జత అను పదములనుండి వచ్చియుండవచ్చును.

అనంతపురముజిల్లాలో తబ్జూల, జూలుకుంట, జూలకాల్వ.

13. గుడి: 11-వ శతాబ్దములోని అస్సాములో వైద్యదేవుని కమలీ దానశాసనములో 'శిలాగుడి' అని యున్నది.

14. కులం, కోలం - పై శాసనములోనే 'కులాచాపడీ' (అనగా కొలని చావడి) అని ఉన్నది. ఈ జిల్లాలో శిరేకులం, మైదగోలం అని ఉన్నవి.

15. ఆలి: 12-వ శతాబ్దమునందు ప్రాగ్జ్యోతిషమందలి ధర్మపాలుని శాసనములో 'ఖగ్గాలి' అని ఉన్నది. అలి అనగా గట్టు అని అర్థము. అనంతపురం జిల్లాలో అగళి.

16. అల; ఆల: సం. వాట. అమిదాల, కురుమాల, కొట్టాల, గుండాల, చాబాల, పుప్పాల, మారాల, సంగాల.

17. మంచి: ధర్మపాలుని శాసనములో 'అమంచి' అని ఉన్నది. గచ్చి (=ఒక చెట్టు)లో నుండి ఇది పుట్టినది.

18. పాళ్యం, పాలెం, పాల, 1243 సంవత్సరములోని చిట్టగాంగ్ తామ్రశాసనములు నౌరపాల్య, కేతంగపాల అనియున్నవి.

కోనేటినాయనిపాళ్యం; నార్పాల; కేతంగపాలకును కేతగానికాల్వకును పోలిక చూడుడు.

19. గూడు, గూల, గోడు; సం. ఘోష: ఆవులదొడ్డి, ఉదా. గూళపాళ్యం.