పుట:Andhra bhasha charitramu part 1.pdf/712

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోద = ముద్రా = మొద్దా.

పట్నం = ప్రస్థానం లేక ప్రతిష్టానం

తావళం = తావు - వోలం = స్థానవోలం.

చాదం = ప్రసాదం.

కదిరి = స్కదిత P + ఇకా.

గూళ్యం = గోపాలికం = గోవాలియం = గూఆలియం = గూళ్యం.

కొన్ని గ్రామముల పేర్లు పూర్తిగా సంస్కృత పదములే.

ఉదా:- అగ్రహారం, ఇంద్రావతి, కల్యాణదుర్గం, కోమలి, చందన, ఛత్రం, నరసాంబుధి, (పెన్న) అహోబిలం, మాల్యవంతం, లేపాక్షి, హేమావతి, నగరు (ఊరు), సంగమేశ్వరం, అనంతపురం, అమరాపురం, కృష్ణాపురం, గరుడాపురం, గోవిందపురం, జయపురం, హనుమాపురం, ధర్మపురం, నారాయణపురం, భైరాపురం, మాలా, ముక్తాపురం, రాజాపురం, రామాపురం, వాసుదేవపురం, వీరాపురం, వెంకటాపురం, శ్రీకంఠాపురం, శ్రీరంగాపురం, సీతాపురం మొదలగునవి.

ఈ సంస్కృత నామములతో నున్న గ్రామములు ప్రాచీనమైనవి కావు. నాలుగైదు శతాబ్దముల లోగడవి. కాలముఇంకను వానిని మార్పలేదు. కాని మొదటి పదముయొక్క తుదిఅచ్చు మాత్రము దీర్ఘమయినది. ఉదా:- కృష్ణా (పురము), హనుమా (పురము), ఆ గ్రామములు ఇంకను వేయి సంవత్సరముల కాలము నిల్చి, ఇంకొక విధమగు ప్రబలమైన మార్పు కలుగనియెడల, వానిపేరు లేరీతిగా ముందు మాఱగలవో ఈ దీర్ఘాచ్చు సూచించుచున్నది.

ఇతరనామములు తెలుగుపదములను సూచించునవి, లేక ద్రావిడ పదములను సూచించునవి. ఇవి తెనిగుజిల్లాలలోనే కాక ద్రావిడ దేశమునందును తక్కిన భారతదేశమునందు పలుచోట్లను కనబడుచున్నవి. బంగాలీ భాషలో గూడ నీ పోలికలు కాన్పించుచున్నవి.

ఉదా:- కాడి = బం. కాటి, ఖాదివిషయ, ఖాటికా, ఖాడి.

ప్రాచీన బంగాళీ భాషలోని, ఖాటా, లేకఖాడా, అను పదము నూతన బంగాలీలో ఖాడీ అగుచున్నది. అనగాచిన్నయేటిని దాటు పడవ అని అర్థము. ఖాడీయే తర్వాత గాడి, హాడి, ఆడి, అడిగా మారినది.

అనంతపురము జిల్లాలోని కాటిగానికాల్వ, కొక్కంటి, కేకాటి, మొదలగునవి; కాడు అను పదమునుండి యైనవని వ్యుత్పత్తిని ఊహింపవచ్చును. కాడు = అడవి. కాష్టము నుండియే కాడు వచ్చియుండును.