పుట:Andhra bhasha charitramu part 1.pdf/706

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లాఠాలు - Beans - బలమైన దళసరి కఱ్ఱదుక్కలు. ఇవి ఓడకు అడ్డుగా వేయబడి రెండుప్రక్కలను కదలకుండ బిగువుగా నుంఛును. వీనివలన తట్టుకుకూడ చాలబలము. లాఠాలు తట్టుకు పైభాగమున ఉండును. చూ. వారులు.

లానులు - Earings - మీదిలానులు. ఈ చాపలమీది కొసలను పరమానులకు లాగి కట్టుతాళ్లు. Sheets క్రిందిలానులు. క్రిందికొనలను లాగి ఉంచునవి.

లింగీలు - Nippers - లంగరు ఎత్తునప్పుడు మిసింజరుత్రాటిని అమారుని కలిపికట్టుటకు ఉపయోగించు చిన్న త్రాళ్లు.

లోతు - (రెండు ఓట్ల మధ్యనుండునది) - Trough - రెండు పెద్దకెరటముల మధ్యను ఏర్పడిన లోతు. ఓడ ఈ లోతులో పడిన చాల దెబ్బతినును.

వట్రకాను. రూ. వట్రపుకాను - Hawse holes - చూ. గుడుగుడా.

వట్రపుకాను రూ. వట్రకాను.

వారులు - Beams - చూ. లాఠాలు. లాఠాలు తట్టుమీదుగా ఓడయొక్క రెండుప్రక్కలను బిగించును. వారులు లోపలిభాగములో అనగా తండాలోనుండి బిగించును.

సంకలు - లంగరు దండీయును క్రిందిదుక్కయును కలియు దగ్గఱ ఏర్పడు కోణములు.

సత్తారు - Slopping - వాలుగా ఉన్న నేలకు 'సత్తారుగా ఉన్న నేల' అందురు. చూ. పక్క.

సందపోరీ - Dog-watch - మధ్యాహ్నము 12 గంటలనుండి రాత్రి పండ్రెండు గంటలవఱకు పారా ఇచ్చువాడు. చూ. బొణియాపోరీ.

సబురు - Voyage, run - ఓడప్రయాణము. "ఓడలు రేవులో లేవు; సబురువెళ్లి ఉన్నవి. " "ఏడాదికి ఒక ఓడ నాలుగు సబుర్లుకంటె హెచ్చు వెళ్ల లేదు. " "సబురుకు మాలీముకు 500 రూపాయలు ఇస్తారు." "తెనుగు ఓడలు ఒకొక్కప్పుడు చీనా, జపాన్, వరకూ సబురు వెళ్లుతవి." "దరివెంబడినే సబురు వెళ్లడము సులభము. నడిసముద్రముమీద కష్టము."

సమకా - The Mariner's Compass - ఇది ఏ స్థలముయొక్క ఐనను హొరైజనును తెలుపు గుండ్రని అట్ట. దీని సెంటరు నుండి సర్కమ్ఫరెన్సు వఱకును గీతలుగీసి దీనిని 32 సమభాగములు చేయుదురు. ఈ గీతలకు రూము గీతలనిపేరు. (Ehumblines). ఈ గీతలకొనలకు రూములని పేరు. (Rhumbs). రూములకు పోయంట్లు అని కూడ సంజ్ఞకలదు. ఒకపోయంటు మరిఒకపోయంటు