పుట:Andhra bhasha charitramu part 1.pdf/705

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రింగిణీలేని ఓడ - Hull - త్రాళ్లు ఏవియు లేకుండు ఓడయొక్క క్రింది భాగమునకు మాత్రము ఇది పేరు.

రింగు - లంగరు దండీ కొనకు త్రాడు కట్టుటకు ఉన్న రింగు.

రీపు - Range of a Cable - అమారు ఎంత దూరమునకు సాగిపోగలదో ఆ దూరము.

రు-ములు - The eight points of the Compass; generally all the points of the Compass; Rhumblines కంపస్సు లేక సమకా మీద చూపబడిన అష్టదిక్కులకును, ఒకప్పు డన్నిదిక్కులకును ఇది పేరు.

రోదా - Sheave - ఒకదిమ్మలో అమర్చబడిన త్రాడు జారుటకు ఏర్పరుప బడ్డ చక్రము.

రోలు మోపు అగుట - To labour - చూ. పొర్లుట.

లంగరు - Anchor - దీనికి త్రాడు కట్టుటకు మీద రింగుగల ఇనుప దండీయును, దాని అడుగున వంగియున్న ఇనుపదుక్కయును, దుక్కకు రెండుకొసలకును వాడియైన పన్నులును, ఈ పన్నులు మొద్దుకాకుండ వానిమీద చేటలును ఉండును. దండీయును, క్రింది ఇనుపదుక్కయును కలియుచోట ఏర్పడిన కోణములకు సంకలు అని పేరు. ఈ లంగరుకు కట్టిన త్రాటికి అమారు త్రాడని పేరు.

లంగరు ఈడ్చుకపోవుట - A drift - చూ. తేలిపోవుట.

లబ్బు అద్దములు - The coloured glasses in the Quadrant and rhe sextant - క్వాడ్రాంటు, సెక్ట్సాంటులలోని రంగుఅద్దములు.

లాగ్‌పలక - Logboard - ఒకదినమున సమాచారమంతయు అనగా ఏయే వేళలకు ఏ లాటిట్యూడు (అజ్జు), ఏ లాంజిట్యూడు (తూలు)లలో ఉన్నదియు, గాలులు, త్రోవలో జరగిన ఇతరవిషయములు మొదలయినవి ఎప్పటి కప్పుడు వ్రాసికొనుటకు ఉపయోగించు నల్లబల్ల. ప్రతిమధ్యాహ్నము ఈ విషయముల నన్నిటిని లాగ్‌పుస్తకములోనికి ఎక్కింతురు.

లాగ్‌పుస్తకము - ఆయా రోజులలో జరిగిన విషయములను లాగ్‌పలకమీదనుండి ఎత్తి వ్రాసి ఉంచుకొను పుస్తకము.

లాడ్‌పాలు - బొంబాలోని ఒకగొట్టము. తండాలోని నీటిని దూద్‌పాలు మీదికి ఎత్తగా, లాడ్‌పాలు పైకి పంపించును. చూ. బొంబా దూద్‌పాలు.