పుట:Andhra bhasha charitramu part 1.pdf/698

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తూర్పు అకరాబు - జమ్నా - కొచ్చాకు - North - east by North - తూర్పు అకరాబుకు ఎడమవైపు 360 డిగ్రీలలో 1/32 వంతు డిగ్రీలుగా ఉండు దిక్కు చూ. సమకా.

తూర్పు అకరాబు - డావు - కొచ్చాకు - North - east by East - తూర్పు అకరాబుకు కుడివైపు 360 డిగ్రీలలో 1/32 వంతు డిగ్రీలు ఉండు దిక్కు. చూ. సమకా.

  • తూలు - 1. Longitude - గ్రీనిచ్‌నుండి తూర్పుగానో పడమరగానో ఎన్ని డిగ్రీలు ఉన్నదియు తెలుపు కొలత.

2. Departure - ఓడ ఒక స్థలమునుండి తూర్పుగానో పడమరగానో ఎంతదూరము పోయినదియు తెలుపు కొలత.

తెప్ప - Raft - కొన్ని బల్లలను కలిపినట్టి, నదులలో దగ్గరదగ్గర దూరములకు పోవుటకు ఉపయోగించు బల్లకట్టు.

తేలిపోవుట - Adrift - ఓడను ఒకటేస్థలములో ఉంచుటకు లంగరుకు బలము చాలకపోయిన ఆ ఓడ నీటిచేత నడచిపోవుట - చూ - లంగరు ఈడ్చుకపోవుట.

తొందర - Heave of the sea - హెచ్చుపదునుగా నున్నప్పుడు ఓడ మిక్కిలి వడిగా పోవుట.

తౌగాలి - Seraper - చూ. ఇసుకరావు.

దండి = Stock beam or shank of an anchor - లంగరుయొక్క ఇనుపకొయ్య - రూ. దండీ.

దండీ - రూ. దండి.

దబరా - Capstern - త్రాళ్లు మొదలైనవి బరువుగా ఉండి వానిని ఎత్తుటకు మనుష్యులకు సాధ్యముకానప్పుడు ఉపయోగపడు యంత్రము. లంగరునుకూడ ఈ యంత్రముతోనే ఎత్తుదురు - చూ. మిసింజరు.

దబరాత్రిప్పు - To heave - లంగరునుగాని మరి దేనినిగాని దబరాతో మీదికి ఎత్తుట - "దబరా అబేస్ చెయ్యి."

దరచాప - Clue of a sail - చదరపు చాపలక్రింది కొనలు.

దరి - Beach - సముద్రమునంటి ఉన్న నేల.

దరిచూచుట - To make the land - కొయ్య సెలమీదికి వెళ్లి నేల సమీపముగా ఉన్నదియు లేనిదియు చూచుట.