పుట:Andhra bhasha charitramu part 1.pdf/693

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గాయి - North - ఉత్తరదిక్కు. చూ. సమకా.

గాయి-జమ్నా - కొచ్చాకు - North by West. గాయికి అనగా ఉత్తర దిక్కుకు ఎడమవైపు 360 డిగ్రీలలో 1/32-వ వంతు డిగ్రీలుగా ఉన్న దిక్కు. చూ. సమకా.

గాయి - జమ్నా - తీరు - North - North - West - ఉత్తరమునకు వాయువ్యమునకును సరిగా మధ్యనున్న దిక్కు. చూ. సమకా.

గాయి - డావు - కొచ్చాకు - North - by - East - ఉత్తరమునకు కుడివైపు 360 డిగ్రీలలో 1/32 వంతు డిగ్రీలుగా ఉన్నదిక్కు. చూ. సమకా.

గాయి - డావు - తీరు - North - North - East - ఉత్తరమునకు ఈశాన్యమునకును సరిగా మధ్యనున్న దిక్కు. చూ. సమకా.

గాతితాళ్లు - Guy - బరువైన వస్తువు దేనినైన నెత్తునప్పుడుగాని, దించునప్పుడుగాని ఇటునటు కదలకుండ పట్టి ఉంచు త్రాళ్లు.

గుడుగుడా - Hawseholes - అమారుతాళ్లు దూర్చుటకు ఓడకు రెండు ప్రక్కల నేర్పఱిచిన కన్నము. చూ. వట్రపుకాను, వట్రకాను.

గుబ్బాలు - Robands or ropebands - ఇవి జటలవలె అల్లిన పొట్టి తాళ్లు. వీని కొసలకు సూదులకు కన్నమువలె బెజ్జము లుండును. వీనితో చిన్న చదరపు చాపలను వాని వాని కఱ్ఱలకు కట్టుదురు.

గుమారు - Raft port - తండాలో పెట్టుటకు వీలు లేని పొడుగుపాటి దూలములను అమరమునొద్ద పెద్ద బెజ్జము చేసి దానిలో నమర్చి ఉంచుదురు. ఇందువలన ఆ దూలములలో చాలభాగము ఓడకు పైగా పోయియుండును. అట్టి బెజ్జమునకు 'గుమారు' అని పేరు.

గోనున రా ! - "ఓడ తిరుగబడి పోతున్నది; గోనునరా ! గోనున వస్తే ఓడ నిలుస్తుంది." గాలి ఓడకు ఒక ప్రక్కమీదనే గట్టిగా వీచునప్పుడు ఓడ ఒరిగి పోవును. అప్పుడు ఓడను మరి ఒక ప్రక్కకు త్రిప్పిన అది నిలుచును.

గోన్ బోడుదో! - About ship ! To luff - అనిమిని గాలి దారిలోనికి త్రిప్పుట. అట్లు త్రిప్పుచు ఓడలో వారు అను మాట.

గోన్‌వెళ్లుట - Ieeway - గాలి తెరచాపలను నింపగా గాలిదారిగా ఓడనడచుట - చూ. డమాన్ వెళ్లుట.

చడాలు ఊడినకొన - Fag end - అతి తరుచుగా వాడుక అగుటచేత త్రాటికొన పురి విడిపోవును. అట్టికొన చడాలు ఊడినకొన. ఆ కొనకు ట్వైను దారము వేసి కట్టుదురు. అట్లు కట్టుటకు చడాలు కట్టడమని పేరు.