పుట:Andhra bhasha charitramu part 1.pdf/691

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాను - The passage by which water on the deck flows out into the sea. తట్టుమీదచేరిన నీరు మరల పైకిపోవుట కేర్పరచినదారి.

కామ్‌చోడో - Avast! ఏదైన జరుగుచున్న పని ఆపుచేయవలసినదని చేయు ఆ:

కామిరీ - Cuddy, Birth, cabin. మాలీము, సరంగులు, పరుండుగది. ఇది అమరము దగ్గర ఉండును. చూ. అల్కాన్, ఛత్రీ. రూ. కేమిరీ.

కాలువ - Narrows. రెండుగట్టులమధ్య నుండుదారి.

కిటికీరెక్కలు - Dead lights, తుపానువచ్చునని తెలిసినప్పుడు కేమిరీ గది కిటికీలను గట్టిగా మూసివేయు దళసరి బల్లలు.

కిఫలయి - West by the Mariner's Compass. పడమర. చూ. నమకా.

కిఫలయి - జమ్నా - కొచ్చాకు - West by south - తూర్పుదిక్కుకు ఎడమవైపు 360 డిగ్రీలలో 32-వ వంతు డిగ్రీలను తెలియజేయు దిక్కు. చూ. సమకా.

కిఫలయి - జమ్నా - తీరు - West - south - West. కిఫలయికిని, కచ్చం అకరాబుకును సరిగా మధ్యనుండుదిక్కు అనగా పడమరకును నైఋతికిని సరిగా మధ్యనున్నదిక్కు. చూ. సమకా.

కిఫలయి - డాపు - కొచ్చాకు - West by North. పడమరకు కుడివైపు 360 డిగ్రీలలో 1/32 వంతు డిగ్రీలను చూపుదిక్కు. చూ. సమకా.

కిఫలయి - డాపు - తీరు - West - North - West. ఉత్తరమునకును వాయవ్యమునకును సరిగా మధ్యనుండు దిక్కు. చూ. సమకా.

కుతిలీ - The doorway leading into the inside of the ship Companion; ఓడ లోపలిభాగములోనికి అనగా తండాలోనికి పోవు ద్వారము. కుతిలీపైని పాలకాయలుండును. పాలకాయలమీద తరపాలు పఱచుదురు.

కేట్లు - Catheads; ఓడ అనిమి అమరముల యొద్దనున్న రెండు బలమైన దూలములు. లంగరును పైకి ఎత్తి వేసి ఈ దూలములకు కట్టివేయుదురు.

కేటుకులాగడము - To fish the anchor. లంగరును అనిమి అమరాలకు మీదుగా లాగివేసిన తరువాత లంగరు పన్నులను తట్టుకు మీదుగా ఉండునట్టు చేయుట.

కేటుతండేలు - One of the boat swain - రింగినీ, లంగరు, మొదలైనవాటి పూచీగల నావఅధికారి. చూ. పెద్దతండేలు, చిన్నతండేలు, సాథారణముగా ఓడలో ముగ్గురు తండేళ్లుందురు.