పుట:Andhra bhasha charitramu part 1.pdf/624

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేళ్లతో నుండిన పిశాచజనులకును ఘోరయుద్ధములు జరిగెను. స్థానబలముచే బిశాచజనులు తొలుత జయము నొందునట్లు గాంపించినను, తుదకోడిపోయిరి. అందు గొంద ఱార్యులతో సంధి చేసికొనిరి. కొందఱు వేఱుస్థలములందు స్వతంత్రులుగ నిలిచిరి. పిశాచజను లార్యావర్తమున వ్యాపించినట్లు సూచింపబడిన రెండుమార్గములకును నీ పోరాటముగూడ కారణమై యుండును. ఆర్యులు గంగా - సింధు మైదానము నాక్రమించుకొని, యచ్చట నుండి గంగానదీ తీరము ననుసరించి మగధదేశమువఱకును వ్యాపించిరి. ఈ ప్రదేశమునందే వేదభాషకు గొంత విలక్షణమగు సంస్కృతభాష యేర్పడినది. అప్పటికే మగధదేశము పిశాచజనాక్రాంతమై యుండెను. పైశాచీభాషాసంపర్కమువలన సంస్కృతభాష పాలిభాషగా మాఱినదని కొందఱు పండితు లూహించుచున్నారు. ఈ పాలిభాష కేకయదేశమునందే, అనగా నేటి పశ్చిమోత్తరపరగణాల కావలి ప్రాంతమునందే, యేర్పడినదని మఱికొందఱు పండితుల యభిప్రాయము. బుద్ధుడును, పాణినియు విద్యనభ్యసించిన తక్షశిలావిద్యాపీఠ మీప్రదేశము నందుండుటయే యీయూహకాధారము. పాలిభాష తక్షశిలాప్రాంతమున నేర్పడినను, మగధ దేశమున నేర్పడినను దానికి పైశాచీభాషయే కారణమనుట మం యభిప్రాయ భేదములు లేవు. సంస్కృతమునకు బైశాచీసంపర్క మెక్కువకాక దానితో దగ్గఱ పోలికగల భాష పాలిభాష, పైశాచీసంపర్క మెక్కువ యగుటచే నేర్పడినది మాగధీ ప్రాకృతము.

ఇట్లుండగా సింధునదీమార్గము ననుసరించిన పిశాచజనులయందలి బాహ్లికశాఖవారు దక్షిణముగ సాగిరి. గుజరాతు ప్రాంతమునకు వచ్చువఱకును బైశాచీభాషలు నెలకొనెను. కాని గుజరాతునందు వీరి భాషకును దరువాత వచ్చిన సంస్కృతభాషకును సంపర్క మేర్పడి తన్మూలమున సంస్కృత లక్షణ మెక్కువగాగల శౌరసేనిప్రాకృత మేర్పడిన, పైశాచీభాగమెక్కువయైనభాష శౌరసేనీపైశాచిక మయ్యెను. ఈలోగా మధ్యదేశము నార్యు లాక్రమించికొని వింధ్య పర్వతములవఱకును సాగిరి. ఇచటి పిశాచజనులకును వీరికిని సంఘర్షణము గలిగెను. కొంతకాలమునకు వారు వింధ్యమును దాటిరి. వ్యాసుడు వింధ్యగర్వమునడంచుట యనెడు నైతిహ్యము దీనిని దెలుపుచున్నది. ఇచ్చటి పిశాచభాషకును సంస్కృతమునకును గలిగిన సంపర్కమునుబట్టి, ఆంధ్రులకును మహారాష్ట్రులకును సాధారణముగు నొకభాష మహారాష్ట్రి యనుపేర నేర్పడెను.

ఈ రీతిగా ప్రధాన ప్రాకృతములని ప్రాకృతలాక్షణికులు దలంచిన మహారాష్ట్రీ, శౌరసేనీ, మాగధీభాష లేర్పడెను. ఈ మూడు భాషలును