పుట:Andhra bhasha charitramu part 1.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అయిదవ పకరణము. o ئے& ధ్ర శబ్దజాలము ~- موهوه حجO- و»حOسسوټــهـــــــ ఇంతవఱకును ఆంధ్రువుందలి ప్రత్యేక ధ్వనులనుగూర్చియు, నాధ్వ నులు దగ్గఱగఁ జేరునప్పడు గలుగు వికారములను గూర్చియు వివరించియుం టిమి. కాని, కేవలధ్వనులసముదాయను భాషకాఁ జాలదు, కా, కీ, గూ, సే, అని యీ రీతిగా ధ్వనుల నుచ్చరించుట వలన నెట్టి యభిప్రాయమును తెనుఁ గున స్ఫరింపదు. ఏకధ్వనిగాని, అట్టిధ్వనుల సముదాయముగాని యర్థవంత వుయినప్పడే యది భాషాసంజ్ఞ నొందుచున్నది, భాష మనోగతాభి ప్రాయము లకు గుఱుతు. వునయభిప్రాయముల నితరులకుఁ దెలుపుటకుఁగాని, యెుకరి యభిప్రాయములను మనము గ్రహించుటకుఁగాని భాషతోడ్పడును. మానసిక δόουλ నభిప్రాయ మెప్పడును సంపూర్థ ముగనే యుండును; బానిని ధ్వనిరూప ముగ సంపూర్ణముగ బహిర్గతము చేయునది వాక్యము, కావున భాషయందు వాక్యమే ప్రధానాంశము. అభిపాయమును సంపూర్ణ ముచేయని ధ్వనులు గాని, పదములుగాని యెన్నియున్నను వాకము "గా నేరదు. అభిపాయమును సంపూర్ధముచేయు నొక్క పదమైనను వాక్యమగును, ప్రతి సంపూర్ణ వాక్యము నందును కర్త, కర్మ, క్రియ అనున వన్నియు వ్యక్తము కానక్కఱలేదు, 'పో’ అనున దొక్క టేక్రియాపద మైనసు, ఏ కాకర యుక్తమైనను నదివాక్యమే. ఇది యకర్మకక్రియ గావున కర్మను తెలుపుటకు వీలు లేదు. కాని ఆ క్రియ యందే 'నీవు అను కర్తృపదము లీనమై యవ్యక్తముగనున్నది. దానిని వ్యక్త ముచేసినను అభిప్రాయమున నెట్టి భేదమును గలుగదు. అట్ల, “吉” అను నప్పడు ' తెచ్చు' ధాతువు సకర్మకమగుటచే కర్తృకర్మ వాచక పదములు రెండును నవ్యక్తములుగ క్రియాపదము నందులీనము లైయున్నవి. ఆ రెండిం టిని తెలిపినను నభిప్రాయమున భేదము కలు^దు. కాని, కర్మనుగూడ తెలిపినయెడల నభిప్రాయ మొకప్పుడు మఱింత స్పష్టము కావచ్చును. తే' అని చెప్పనప్పడు తత్పూర్వము తేవలసినవస్తువు స్పష్టపడి యుండిన యెడల నాకర్మ పదమును స్పష్టముచేసినను చేయకున్నను నొక్కటే. కర్తృ పదము తెనుగున సాధారణముగ ఉత్తము, మధ్యమపురుష క్రియల యందే లీనమై యుండుటచేత నట్టిక్రియల కర్తలను స్పష్టముచేసినను చేయకున్నను నొక్క పే; కాని, యర్థము చక్కగ విస్పష్టము కానప్పడు కర్తృపదమును స్పష్టముచేయవలసివచ్చును. ఇద్దజెదురుగా నున్నప్పడు ‘పో' అన్నచో నాయిద్దతిలో నెవరు పోవలయునో తేలదు; "ఎవరు పోవ లెను?' అను