పుట:Andhra bhasha charitramu part 1.pdf/44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విద్యాలయ కేంద్రస్థానము బెజవాడలో నున్నపుడు వారికి నే నాంధ్రభాషా విషయమున జేసిన కృషినిగూర్చి కొంత నివేదించితిని. వారును సంతోషించి యీ గ్రంధమును వ్రాయుమని సెలవిచ్చుటయే కాక, దీని నాంధ్ర విశ్వవిద్యాలయము పక్షమున బ్రచురింపించు నవకాశము గల్పించిరి. వారు విశ్వవిద్యాలయోపాధ్యక్షులుగ నుండినప్పుడు వ్రాయ నారంభించిన యీగ్రంథము వారు మఱల నా స్థానమున నున్నపుడే ముద్రణమునంది ప్రకటనము గాంచుట నాకు ముదావహముగ నున్నది.

గ్రంథముద్రణవిషయమున నతిశ్రద్ధవహించి నా కనేక విధముల దోడ్పడిన శ్రీ ఆనంద ముద్రణాలయమువారికి నే నెంతయు గృతజ్ఞుడను. ఇట్టి గ్రంథమును ముద్రించుట కష్ట సాధ్యమయినపని. సాధారణమయిన మఱి యే ముద్రణాలయమువారికయినను నీగ్రంథముద్రణ మసాధ్యమనియే చెప్పవచ్చును.

చిలుకూరి నారాయణరావు.

అనంతపురము,

1 - 11 - .1936