పుట:Andhra bhasha charitramu part 1.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలనను గలిగిన సంయుక్తాక్షరములు. 'క్ష' కారము క-కార, ష-కార సంయోగమువలన గలిగినదైనను, ఉచ్చారణమున నా రెండు వర్ణములను బ్రత్యేకముగ వినబడక యేకవర్ణముగ వినబడినట్లే 'త్స' 'ద్జ' వర్ణములేక వర్ణములగు ౘ, ౙ లుగ వినబడుచున్నవి. ద-కార జ-కారములకు సంయోగము గలిగినప్పుడు, ద-కార సంపర్కమువలన స-కారమునకు నాదము గలిగి యింగ్లీషులోని 'Z' వంటిధ్వనిగ మాఱినది. ఇట్లే ౘ, ౙ లకు మాతృకలు మఱికొన్నియు గలవు. ఇతరములైన యాచ్ఛిక ధ్వనులను గూర్చిన విచార మీ యధ్యాయమున వేఱొకచోట జేయబడినది.