పుట:Andhra bhasha charitramu part 1.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శకటరేఫము

277

ప్రాంబఱ్తి (S. I. I. శాలి. శక 1150) ; ప్రేంపఱ్తి (S. I. I. శాలి. శక 1151), మద్దిచెఱ్ల (S. II. శాలి. 1248); మఱ్తురు (S. II. శాలి. శక 1165) మిఱ్లపోతె (S.I. I. శాలి. శక 1251); మున్నూఱ్వురు (S.I.I. శాలి. శక 1177); మొఱ్కిపూణ్డి (S. I. I. శాలి. శక 1160) ; యెఱ్యన (S.1.I. శాలి. శక. 1152); రేచెఱ్ల (S. I.. శాలి. శక 122, 1546) ; ఱాపఱ్తి (S. I. I. శాలి. శక 1263, 1413), కాండ్ర (S. I. I. శాలి. శక 1378); విడ్పఱ్ల (S. I. I. శాలి. శక 1286) విత్పఱ్తి (S. I. I. VI. 585) ; ఱ్తి విషయే (S. II. IV. 1239) ; విప్పఱ్తి (S. I. I. శాలి. శక1088); విఱ్చు = కొను (S. I. I. శాలి. శక 11...) ; వెన్నెఱ్వగుణ (S.I.I శాలి. శక 1213). ఇట్లే, మ్రోంతికుఱ్తి, వంగుఱ్తి, కఴపఱ్తి, మూన్ఱు, మగన్ఱు మొదలగు శబ్దము లితర శాసనములందును గానవచ్చుచున్నవి. శబ్దములు మొదలు రేఫ సంయుక్తాక్షరములందు శకటరేషములు వ్రాయఁబడినట్లు తెలియదు.

(8) అప్పకవి కొన్ని పదములందు రేఫద్వయ మతము నంగీకరించి కొన్ని యుదాహరణములు విచ్చియున్నాఁడు.

(i) అఱుగు పోవు “మఱునాఁడయగుట లెస్సగ, వరిగెనినుండపుడు వేఁడి యడరిన దీప్తుల్, తుఱఁగలి గొని పశ్చిమగిరి, చఱికినవతి దూరుఁడై విశదుఁడై తోఁచెన్" (మౌసలపర్వము, 169.) ఈ పద్యమున 'లెస్సగ, నెఱిఁగె నినుండపుడు వేఁడి యెడలిన దీప్తుల్' అను పాఠాంతరము గలదు. ప్రకరణమును బట్టి యీ పాఠాంతరమే సరియైనది. 'అరుగు'లో శకట రేఫము లేదు.

(ii) తొఱఁగు — పుష్పరసము, “తొఱఁగి నెత్తావియందున-నెఱయ నొప్పె"—నృసింహపురాణము; 1. 54. పాఠాంతరమునఁ బై పాదములో " తొరఁగు .. నెరయ " అనియే యున్నది. నృసింహపురాణము నుండియే యప్పకవి యుదాహరించిన “నెరయం బంక జనంభవాలయమున న్నిండారె”— III. 141 - నను పాఠమున లఘురేఫమే యున్నది. తొరఁగు, నెరయులలో శకటరేఫములు లేవు.

(iii) ఆఱు, ఆరు - శాంతి. I. 13 లో " శ్రమ, మారున్నావశము గాక యాతని బుద్ధిన్ " అని లఘు రేపమును, ఆది. IV. 18 - లో "శ్రమంబాఱంగా నెదఁదాపము, దీఱఁగ " నని యలఘు రేఫమును నున్నవి. ఈ రెండును నేక ధాతు రూపములు గావు. శాంతి. లోని 'శ్రమ' మనుటకు 'శమ' మని పాఠాంతరము ; 'ఆరున్' అనఁగా 'నిండుకొను' నని యర్థము.