పుట:Andhra bhasha charitramu part 1.pdf/270

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గూడ ద్రుతమన గూడదు. ప్రాఁజదువు, లేఁగొమ్మ, మొదలగువానిలో దొలుత నువర్ణము లేకుండుటచేతను, వ్యాకరణ కల్పితమగు నుగాగమము వచ్చినను నది కేవలము లోపింపకుండుట చేతను నట్టి సందర్భములందును ద్రుతమున్నదని యనుకొన గూడదు. ఈ రీతిగ సంపూర్ణముగ లోపింపగల నకారమే అనగా 'న్‌' అనుపొల్లే ద్రుతమనియు, నీపొల్లుపై గొన్నియెడల అ, ఇ, ఉ,లు చేరుటయు లోపించుటయు గలుగుననియు, పదములందు సిద్ధములగు న, ని, ను లకు ద్రుతమునకువలె వ్యాకణకార్యములు గలుగుననియు జెప్పవలసియున్నది.

ఇదిగాక నకారమునకు మాత్రము ద్రుతసంజ్ఞయేల యుండవలెనో, కావలసినప్పుడు వచ్చి, యక్కఱలేనప్పుడు మఱుగుపడు 'భయపడు' మొదలగు వానియందలి వైభక్తిక మువర్ణమును, 'పందొమ్మిది' మొదలగు వానియందలి 'ది' వర్ణమును, 'క్రొత్త' మొదలగువానియందలి ద్విత్వతకారమును 'ప్రాయిల్లు' మొదలగువానియందలి తజ్‌వర్ణకమును, నిట్టివి మఱికొన్నియునుగూడ ద్రుతములని యేల యనగూడదో తెలియరాకున్నది.

  • పైరీతిగ ద్రుతవిచారమును జేసినపిమ్మట బ్రహ్మశ్రీ సజ్ఘల --సీతారామస్వామిశాస్త్రులవారు రచించిన "చింతామణి విషయ పరిశోధనము" అను గ్రంథమును జూడఁ దటస్థించినది. వా రందు ద్రుత స్వరూపమునుగూర్చి విపులముగ జర్చించియున్నారు. ఆ గ్రంథమున వారు సిద్ధాంతము చేయనెంచినది చింతామణి నన్నయభట్టకృత మను విషయము కావున దమ వాదమున కనుకూలముగ చింతామణి సూత్రములకు సరిపోవునట్లు నన్నయ ప్రయోగములను వాధించుటకై తమ యుక్తి నంతటిని వినియోగించియున్నారు. ద్రుత స్వరూపము నకారపు పొల్లే యను విషయమున వారితో నేకీభవింతుము. కాని, 'ను' వర్ణమునుగూడ ద్రుతముగనే చింతామణికారుడు తలంప లేదను విషయములు వారికిని మాకును నభిప్రాయభేదము గలదు. చింతామణి పై వ్యాఖ్యల రచించిన వారందఱును మ్రొన్న మొన్నటివఱకు శ్రీ శాస్త్రులవారుగూడ) నకారపు పొల్లు నే కాక, --------- వర్ణములనుగూడ ద్రుతమునకు రూపాంతరములుగ నే పరిగణించియుండిరి. చింతామణిలో '------' - మాత్రమున కిప్పుడు శాస్త్రులవారు క్రొత్త వ్యాఖ్యానమును జేసియున్నారు. ద్రుతమనగా ద్రుత ---- నదని యిప్పుడు చెప్పుచున్న యర్థము. అనగా 'న్‌' పై నకు యచ్చు తొలుత నుండెడిదనియు, ఆయచ్చు లోపింపగా మిగిలిన 'న్‌' మాత్రము ద్రుతమనియు వారు చెప్పుచున్నారు. వారివాదము చొప్పున ద్రుత నందినది, అనగా మఱుగుపడినది అచ్చు కావున ఆ యచ్చే ద్రుత సంజ్ఞ నందవలసియున్నది గదా. అట్టియడ నకారపు పొల్లును ద్రుతమనుట పొసగదు. సరే, నకారపు పొల్లే ద్రుతమని యొప్పుకొన్నను, మఱుగుపడి యుండిన 'న్‌' మీది యచ్చు తిరిగి కనబడుట కాటంకమేమి గలదు? కావున నకారపు పొల్లును ను