పుట:Andhra bhasha charitramu part 1.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొట్టాడు, అనునట్టి క్రియారూపములు మండలభేదమును బట్టి వాడుకయందున్నవి. కొన్ని మండలములలో కొట్యాడు, కొట్టేడు అనునవి వ్యవహారము నందున్నవి. కొట్యాడు, కొట్టేడు, కొట్టాడు, వంటిరూపములు యడాగమము గలిగిన మాండలిక భాషల యందలివియు, కొట్టినాడు, కొట్టిండు, వంటిరూపములు నగాగమము గలిగిన మాండలిక భాషలయందలి రూపములనియు జెప్పవచ్చును.

ఏకపదమునందుగాక రెండుపదములు చేరునప్పుడు పూర్వపదము ద్రుతప్రకృతిక మైనచో 'కిషష్ఠి' యందు తప్ప దక్కిన యన్నిచోట్లను నచ్చు పరమైనప్పుడు ద్రుతము నిలిచి పూర్వపరస్వరములను బ్రత్యేకముగ నిలుచునట్లు చేయును.

ఈ సందర్భమున ద్రుతవిచారమును జేయవలసి యున్నది. ద్రుతమనగా ద్రవించు, లేక, తొలగిపోవు స్వభావము గలదని యర్థము. అది సంధ్యాదికార్యములందు గావలసినప్పుడువచ్చి, యక్కఱ లేనప్పుడు లోపించుచుండును. ఎప్పుడది కావలయును, ఎప్పుడక్కఱలేదు, అను విషయమునను, ద్రుత స్వరూప మెట్టిదను విషయమునను నభిప్రాయ భేదములు గలవు.

ద్రుత స్వరూపము.

"ద్రుతాఖ్యోన:" (ఆంధ్రశబ్ద చింతామణి); అనగా అత్వయుక్తమగు కారము ద్రుతము; "నకారంబు ద్రుతంబు" (బాలవ్యాకరణము; అప్పకవి); అనగా బొల్లగు నకారము ద్రుతము; "నకారంబ సాధారణంబు ద్రుతంబు. ప్రత్యాయాగ మాన్యయాత్మకమై యుత్వ విశిష్టమయిన నకారంబు ద్రుత సంజ్ఞకంబని యర్థము. ద్రుతమనగా నొల్లని యెడ మఱిగి పోవునదియనుట. ప్రత్యయాత్మకమైన నకారమునకు: తాను, నేను, ధనమును, వనమును, చదువుచున్నాను, చదువగలను మొద: ఆగమాత్మకమైన నకారమునకు: అన్నియును, తమ్ముండును, మఱియును, ఏనియును మొ; వలయుచో నీ ద్రుతమునందలి యుత్వంబునకు లోపంబగు. ఉన్నాను, ఇత్యాదులయందు ద్రుతము నందలి యుకారంబునకు లోపంబుగలుగదు. శబ్దాను శాసనుడు 'ద్రుతాఖ్యోన:' అని కేవల నక్కర గ్రహణము చేయుట ద్రుతమునకు స్థిరత్వ సిద్ధికై యని తెలియవలయును" ప్రౌడ వ్యాకరణము. 'ఇకార ఉకారములతో గూడినదియు, పొల్లుగా నుండునదియు నయిన నకారము ద్రుతమనబడును. (ఆంధ్రభాషానుశాసనము.)

పైదానిని బట్టి ద్రుతస్వరూపమును గూర్చి యేకాభిప్రాయము లేదనుట స్పష్టము. న్, న, ను, ని, లు నాలుగును ద్రుతము లుగ వేర్వేఱువైయామణులచే బరిగణింప బడుచున్నవి. ప్రౌఢవ్యాకరణ కారునియభిప్రాయము