పుట:Andhra bhasha charitramu part 1.pdf/266

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దీ యచ్చుల యాకర్షణము కనబడుచున్నది. కొంతవఱకు నీ విషయమునందును భాషతెనుగును బోలియున్నది. కాని, తక్కిన ద్రావిడభాషలలో దేని యందైనను నిట్టి మార్పు కలుగు ననుట కాధారములు లేవు. ఈ యచ్చుల యాకర్షణశక్తి ననుసరించియే భాషాకుటుంబముల సంబంధమును నిర్ణయించినచో, నిట్టి యచ్చుల మార్పుల గలిగిన జర్మనుభాష నార్యభాషల నుండి తొలగించి, సిధియను భాషావర్గమున జేర్పవలసియుండును.

ఈ యచ్చుల యాకర్షణము తెనుగున గాన్పించుచున్నదని గ్రహించినను, నట్టి విశేషము సిధియనుభాషలని తలంపబడువానివలన గలిగినదని తలంచుటకు వీలులేదు. ఈ సిధియను భాషలన్నిటి యందును నీ యాకర్షణము గానరాదు. ఇట్లుండ, ప్రాకృతభవములగు కాశ్మీరీ, షినా భాషలయందు, అందు ముఖ్యముగ కాశ్మీరీభాషయం దీ యచ్చుల యాకర్షణము సంపూర్ణముగ నున్నది. ఈయాకర్షణము పైశాచీ భాషలన్నిటియందును గాననగును. ఇందు మూలమున ద్రావిడభాషలకును, అందును దెనుగునకును బైశాచీ, ప్రాకృతమునకును గల సంబంధ మేర్పడగలదు ఈ విషయమై పరిశోధనములు జరుగవలసి యున్నవి.

ప్రకృతిభావ నివారము.

(Prevention of Hiatus.)

ద్రావిడభాషలయందు రెండచ్చు లొకదానితరువాత నొకటి వచ్చినప్పుడు సంధియైనను నగును; లేదా, ఆరెండిటి మధ్యమున నొక హ ల్లాదేశముగ నైనవచ్చును. అ ట్లాదేశముగ వచ్చు హల్లులలో య, వ, వలు ముఖ్యములైనవి. తెనుగున య, న, లాసందర్భములందు సాధారణముగ జేరుచుండును. ఉత్తుపై నచ్చు వచ్చునపుడు సంధియగును; అనగా పూర్వ పరస్వరములకు పరస్వరమేకాదేశమగును. అత్వసంధి బహుళము: ఇత్వసంధి కొన్నియెడల వైకల్పికము; కొన్ని యెడల సంధికాదు. సంధిరానిచోట యడాగమమువచ్చును. రాముడు + అక్కడ = రాముడక్కడ; మేన + అత్త = మేనత్త, మేనయత్త; దూత + ఇచ్చెను = దూతయిచ్చెను; మఱి + ఏమి = మఱేమి. మఱియేమి; చేసి + ఇచ్చెను = చేసియిచ్చెను.

తమిళములో భూతార్థక క్రియావిశేషణ చిహ్నమగు 'అ' కారము ఇకారాంతమగు క్త్ర్వార్థకముపై జేరునప్పుడు 'య' కారమైనను 'న' కారమైనను నాగమముగా వచ్చును. ఉదా: కట్టి+అ=కట్టియ, కట్టిన. తెనుగున నిట్టిచోట్ల నగాగమమే వచ్చును: కట్టిన, తమిళమున 'కట్టిన' 'కట్టియ' అనునవి మాండలికరూపములు. మండలభేదముచే తెనుగున గూడ య, న కారము లాగమములుగా వచ్చియుండెననుట కొక నిదర్శనము కలదు. కొట్టినాడు