పుట:Andhra bhasha charitramu part 1.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. తొల్లింటి రూపములు వ్యవహార భ్రష్టములయి, మాఱిన రూపములు నిలచుట: ఒఱపు, ఒప్పు: అలవోపు, ఆపోవు.

3. తొంటి రూపములు వ్యవహారముననిలువుగా మధ్యకాలమున నేర్పడిన రూపములు వ్యవహార భ్రష్టములగుట: అలముకొను, ఆముకొను; చుఱుకు, న్రుక్కు.

4. తొంటి రూపములును రూపాంతరములును వ్యవహారభ్రష్టములగుట: ఉదా. ఇలుకువ, ఇక్కువ = ఇలుకు, ఇక్కు = వాసస్థానము, ఉరవు, ఉవ్వు = ఒప్పిదము.

5. తొంటి రూపమును, నర్థమును జాలమఱుగుపడియుండుట: నాలి = ఆలి = హాలి = హావలి = నీచత్వము ; చూ. కూలినాలి. ఇచట నొక నకారము పదాదిని చేరుటచే నీపదము వ్యుత్పత్తి మఱుగు పడినది.

6. తొంటి రూపము చాల మఱుగుపడియు బోల్చికొనుటకు వీలుగానుండుట: ఇఱుకుపాటు = ఇక్కట్టు.

7. తొంటిరూపము వ్యవహారమున నిలచియుండ దానిరూపాంతరము ప్రత్యయముగా మాఱుట: అలరు = ఆరు; చూ. నిండారు. సొంపారు, మొద.

8. తొంటిరూపమును దాని రూపాంతరమును నర్థభేదములతో వ్యవహారమునందు నిలచుట: అడచు, అచ్చు, అణగు, ఆగు

9. ఏక మండలమునందు తొంటిరూపమును, దాని మాఱినరూపమును వివిధముగ వాడ బడుట ; మొలకెత్తు ('మొక్కెత్తు కాదు')

ద్రావిడభాషలు ప్రత్యేకభాషలుగ బరిగణింపబడుటకు ముఖ్య కారణములలో నీ యస్పష్టాచ్చుల మూలమున గలిగిన మార్పుగూడ నొక కారణమై యున్నది.

అచ్చుల పరస్పరాకర్షణము.

(Harmonic sequence of vowels.)

సిధియను భాషలలో ననగా ఫిన్నిషు, తుర్కిషు, మంగోలియను, మంచూభాషలలో నచ్చుల పరస్పరాకర్షణ సూత్రమొకటి కలదనియు, నందచ్చులు నాలుగు వర్గములుగ బరస్పరమైత్రి ననుసరించి యేర్పడియున్నవనియు, ధాతువునందుగాని, పదమునందలి యొకభాగమునందుగాని యున్న యచ్చు ననుసరించి యాపదము తక్కిన భాగమందో, యాపదమునకు జేరు ప్రత్యయములందో వచ్చునచ్చు లాయా వర్గీయాచ్చులుగ మాఱుచుండు