పుట:Andhra bhasha charitramu part 1.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలెజాలవఱకు హలంతముగానే యుండెను. నేడయినను, పదములతుది మత్వము వ్యవహారము నందును, సంధియందు నాడును, నేడును గూడ లోపించుటగాననగును. అ, ఇ లవిషయమున గూడ గొన్నిసందర్భములందు --పముకలుగుచున్నది.

ఇట్టి యస్పష్టాచ్చు లెక్కువగ పైశాచీప్రాకృత వికారములగు నేటి షినా, కాశ్మీరీ, సింధి మొదలగు భాషలయందు గాన్పించు చున్నవి. కాశ్మీరీ భాషయందు వీనిని మాత్రాచ్చులందురు. ఆ భాషయందీ మాత్రాచ్చుల పరివర్తనము వలనగొన్ని వ్యాకరణకార్యములును గలుగుచుండును.

ఈ యస్పష్టాచ్చులు తక్కిన ద్రావిడభాషలయందువలె -

1. పదాదిని ద్రావిడులుచ్చరింపజాలని 'ర, ల' లకూతగా నిలుచు చుండును. ఉదా. అరను, ఇఱుకు, ఉలక మొద.

2. పదమధ్యమున ద్విత్వములు కాని సంయుక్తాక్షరములను విడదీయుటకుపకరించును. ఉదా. చందురుడు, ఈరసము మొద.

3. పదాంతమందు కొన్నియచ్చులు సాధారణముగ వ్యవహారమునందును, వాఙ్మయమునందును వ్యవహారమునందును సంధియందును లోపించు చుండును. ఉదా. భయంపడు, విజయంచేయు; ధనం, ఫలమ్ మొద.

విభక్త్యాదివ్యాకరణరూపముల యుపధాచ్చులకు సాధారణముగలోపము రాదు. ఉదా. కలికి, కల్కియగును గాని, చలికి, చల్కికాదు; అందున, అంద్న కాదు. 'గమకను' వ్రాతలో 'గన్కు' అని వ్రాయుదురుగాని దాని యుచ్చారణము వాఙ్మయమునకును, వ్యవహారమునకునుగూడ విరుద్ధము.

ఈ యస్పష్టాచ్చులు పదములందు చేరుటవలనను, వానినుండి లోపించుటవలను గొన్ని మాండలిక రూపము లేర్పడుచున్నవి. ఇట్లేర్పడిన రూపాంతరము లాయామండలములందు దమతొంటి యర్థములందే వ్యవహారమున నిలువవచ్చును. కొన్నిట నవి యర్థాంతరముల నందవచ్చును. కొన్ని కేవలము వ్యవహారమునందే నిలువవచ్చును కొన్ని యాయామండలముల కవులు వాడుటచే వాఙ్మయమున కెక్కవచ్చును. ఒకప్పుడు తొంటి రూపము భాషనుండి తొలగవచ్చును. ఒకప్పుడు పూర్వరూపమే నిలిచి, మాఱిన రూపము తొలగవచ్చును. కొన్నియెడల రెండు రూపములును నేకమండలమునందు వేర్వేఱర్థములందును, వేర్వేఱు విధములుగను వ్యవహారమునందు నిలువవచ్చును. ఉదాహరణములు:-

1. మాండలిక భేదములు, అర్థభేదము లేనివి: అనంతపురము: మొలక ; ఉత్తరసర్కారులు: మొక్క, రాయలసీమ: ఆడ, ఉత్తరసర్కారులలోనగ్రవర్ణములవారు: అక్కడ.