పుట:Andhra bhasha charitramu part 1.pdf/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శుద్ధమయిన భాష యేది? ప్రమాణ భాష యేది? ఆయాభాషలలో మిక్కిలి సమర్థమయిన దేది? అందమయిన దేది? - ఇట్టి ప్రశ్నలు సాధారణముగా సనాలోచితములుగా పుట్టుచుండును. ఇట్టివి శాస్త్రీయ ప్రశ్నలు కావు. అట్టి ప్రశ్నలమీదనే దృష్టినుంచువా రుత్తమమైన, సంపూర్ణమైన భాష యెట్లుండును, అను విషయమునుకూడ చర్చించుచుండురు. శాస్త్రపరిషత్తేదియు నిట్టి ప్రశ్న నాదరింపదు. అయినను బెర్లినుసాహిత్యపరిషత్తు వారు 1794 సం. రమున నుత్తమభాషాలక్షణ మేమి? యూరోపియను భాషలలో ముఖ్యమయినవానిలో దేని కీ లక్షణము పట్టును? అను విషయమునుగుఱించి పోటీ వ్యాసములను వ్రాయించినారు. అందులో డి. జెనిష్ అను బెర్లిను నగరములోని యొక మతగురువు బహుమానమును పొందెను. ఈ వ్యాసమునుగుఱించి నాటనుండి నేటివఱకు విద్వాంసులు తలంపనైనను దలంపలేదుగాని, యది తప్పక చదువవలసిన వ్యాసము. "మనుష్యుని బుద్ధియొక్కయు నీతియొక్కయు సారము భాషలో వ్యక్తమవును. మాటతీరులోనే మనుష్యుని స్వభావము తెలియునని ప్రాచ్యులు చెప్పుమాట సత్యము. అనాగరకుని మాట మోటుగాను, మొద్దుగాను నుండును; నాగరకునిభాష లలితముగా నుండును. గ్రీకువారి భావన సున్నితముగాను, ఆలోచన సరసముగాను నుండును. రోమనులు తాత్త్విక బుద్ధి కలవారుకారు; వారు కార్యసాధనపరులు. ఫ్రెంచివారు జన సమ్మనపాత్రులు; స్నేహభావము కలవారు. బ్రిటిషువారు గంభీరస్వభావము గలవారు. జర్మనులు తత్వైక దృక్కులు వై జాతుల స్వభావమెట్టిదో, వారి భాషకూడ నట్టిదే యని జెనిషు తన బహుమాన వ్యాసముయొక్క పీఠికలో వ్రాసిన వాక్యము లతని ననుసరించినవారు కాకపోయినను హంబోల్టు, సైన్థాలు, పిన్కు, బిర్ను, మొదలయిన భాషాతత్త్వవేత్తల గ్రంథములకు మేలుబంతులుగా నుండదగినవి.

భాషయనునది మనభావముల నితరులకు తెలియజేయు నొకసాధనము; ఆక్షణమున కలిగిన భావము నప్పటికి దెలియజేసిన దాని యుపయోగము తీరి పోవును.

(1)శబ్దసంపద (2) శక్తి (3) స్పష్టత (4) శ్రావ్యత - అను నాలుగును భాషల ముఖ్యలక్షణములు. శబ్దసంపద విషయమై యాలోచించునప్పుడు, ఈ భాషలో వస్తువులకును భావములకును శబ్దము లెంతవఱకు నున్నవి అను విషయమేకాక యున్నశబ్దములనుండి క్రొత్త శబ్దముల నెంతవఱకు కల్పించుకోవచ్చును అను దానినికూడ నాలోచింపవలెను. భాషయొకా శక్తి నిఘంటువులలోను, వ్యాకరణములలోను వ్యక్తమగును. వ్యాకరణమెంత