పుట:Andhra bhasha charitramu part 1.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐ: కైఅవ = కైతన; ఐరావణ (భట్టికావ్యము 13, 38).

ఒ: (1) ఔ=ఒ: మహారాష్ట్రి, జైనమహారాష్ట్రి: కొత్థుల=కౌస్తుభ (భామహుడు; హేమచంద్రుడు; గౌడవహో; హాలుడు; రావణవహ.) మహారాష్ట్రి, అర్ధమాగధి, జైనమహారాష్ట్రి, శౌరసేని, అపభ్రంశము: జొవ్వణ=యౌవన.

మహారాష్ట్రి: దొచ్చ = దౌత్య (హాలుని సప్తశతి 84). మహారాష్ట్రి, శౌరసేని: దొబ్బల్ల = దౌర్బల్య (గౌడవహో; హాలుని సప్తశతి; రావణవహ; శాకుంతలము; 63, 1): జైనమహారాష్ట్రి: పవొత్త = ప్రపౌత్ర.

మహారాష్ట్రి, శౌరసేని: మొత్తిఅ; జైన మహారాష్ట్రి: మొత్తియ=మౌక్తిక (గౌడవహో; హాలునిసప్తశతి; రావణవహ; మృచ్ఛకటికము 70, 25; 71, 3; కర్పూరమంజరి, 73, 5; 82, 8; విద్ధసాలభంజిక, 108, 2).

మాగధి, అర్ధమాగధి, జైనమహారాష్ట్రి, జైనశౌరసేని, శౌరసేని, అపభ్రంశము: సొక్ఖ = సౌఖ్య (మార్కండేయుడు; గౌడవహో, హాలుని సప్తసతి. రావణవహ; కప్పసుత్త; క్రమదీశ్వరుడు 9; ఓవనఇయసుత్త; పవయణసార 381, 19, 20; 383, 75; 335, 69; కత్తిగేయణు పెక్ఖ 402, 261, 362 369; మాలతీమాధవము 82, 3; ఉత్తరరామచరిత్రము 121, 4; హేమచంద్రుడు 4, 332, 1.) మాగధి: శొక్ఖ: ప్రబోధచంద్రోదయము, 28, 15; 56, 1, 58, 16).

మహారాష్ట్రి, జైనమహారాష్ట్రి, శౌరసేని: సొమ్మ=సౌమ్య. (గౌడవహో, రావణవహ; క్రమదీశ్వరుడు 7; రత్నావళి 317, 31; మహావీర చరితము 6, 8; ఉత్తరరామచరితము 31, 20; 62, 8; 71, 8; 92, 8: అనర్ఘరాఘవము 149, 9; కంసవధమ్ 9, 2).

(2) ఓ = ఒ.

శౌర: అవహిదొమ్హి (అవహితోస్మి); మహా, అ మాగ, జై. మహా., ఒట్ఠ = ఓష్ఠ; శౌర.; అణ్ణొణ్ణ = అన్యోన్య, మహా, అ, మాగ., శౌర.; పఒట్ఠ (ప్రకోష్ఠ).

(3) తుది విసర్గము=ఓ+ఇ. ఎ=ఒ; మహా. అణురాఒత్తి (అనురాగ: ఇతి); పిఒత్తి (ప్రియ ఇతి); జై. మ. పురిసొత్తి (పురుష: ఇతి: ; గఒత్తి (గత: ఇతి). కాలొవ్వ (కాల: ఇవ); జై. శౌర. సమొత్తి (సమ ఇతి); చారొవ్వ (చార ఏవ); అ. మాగ. భారొవ్వ (భార: ఇవ); సోఒవ్వ (స ఏవ); శౌర. బమ్హణొజ్జెవ్వ (బ్రాహ్మణ: ఏవ).