పుట:Andhra bhasha charitramu part 1.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. ---------------, అను ఒత్తులు వాని మూలహల్లులగు క, మ, న, ల, త, య, వ, ర, లనుండి భేదించుచున్నవి తక్కినహల్లు ఒత్తు లాయా హల్లుల తలకట్లను దొలగించుటచే నేర్పదుచున్నవి.

4. 'దిక్షట్కము'లోని 'క'కును, 'లక్ష'లోని 'క్ష'నునుచ్చారణ భేదము గలదు.

iii. ఉచ్చారణము ననుసరించి యుండని కొన్ని యక్షరములు.

1. ఐ - సంస్కృతమున అ, ఆ, + ఏ=ఐ' 'ఇ' 'ఈ' కారములకు వృద్ధి గలిగియు నైత్వ మేర్పదును. తెనుగున అ+ఇ=అయి=ఐ. ఆకారమును బట్టి ఐ=ఎ+ఇ. అరవ మళయాళములలో ఐ=ఎ+ఇ. తెనుగున 'ఐ' అనునక్షర మరవ మళయాళ సంప్రదాయానురోధి.

2. ఔ - సంస్కృతమున అ, ఆ+ ఓ=ఔ; 'ఉ' 'ఊ' కారములకు వృద్ధి కలిగియు నౌత్వమేర్పడును. తెనుగునను దక్కిన ద్రావిడ భాషలయందును అ+ఉ=వు=ఔ.

3. ఎ - సంస్కృతమున హ్రస్వ ఎ కారములేదు. ఏ కారమున్నది; అది, అ, ఆ+ఇ, ఈల సంధివలన గలుగును; 'ఇ+అ'=య్. తెనుగున ఇ+అ=ఇయ=ఎ (ముత్తియము, ముత్తెము, కన్నియ, కన్నె; మొద) ఇ+అ=య్ అను సంధి 'ముత్తియము, ముత్యము' అనునప్పుడు గలదు. ఇది యేకపద మధ్యమందే కలుగును. సంధియందు కాదు.

4. క్ష - ఇది కకార షకార సంయోగమువలన గలిగినను నా సంయుక్తాక్షరము నుచ్చారణము మాఱినది.

5. జ్ఞ - వ్రాతయం దిట్లున్నను నుచ్చారణ మందిది గ్జ్ఞ, గ్న, గ్నె, గ్గ, గ్గె,'లుగ వివిధ ధ్వనులతో వినబడుచున్నది.

6. చ'ద్ద'న్నము మొదలగు శబ్దములలోని హ్రస్వ 'అప్' కారమునకును వచ్చాను, తాటాకు మొదలగు శబ్దములలోని దీర్ఘ 'ఆప్‌' కారమునకును దెనుగు లిపిలో సంజ్ఞలులేవు.

7. ఋ, ఋ, ఌ ల యుచ్చారణమెట్టిదో తెనుగువారు మఱచినట్లు కానవచ్చును. కొందఱు దానిని 'రు'గను, గొందఱు 'రి'గను సరిగ నుచ్చరించుచున్నా మనుకొనువారు అర్ధమాత్రాక 'అ' కారముతోడి 'ర్‌' గను నుచ్చరించుచున్నారు.

8. త్స - దీనిని 'త్‌న'గా నెవ్వరు నుచ్చరించుటలేదు, దంత్య 'చ్ఛ' కారముగ దాని నుచ్చరింతురు.