పుట:Andhra bhasha charitramu part 1.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. ప, ఫ, వ ల కుత్వము పొక్కిలిలో జేరును; తక్కినహల్లులకు బ్రక్కను జేరును.

11. చేతివ్రాతలో 'ఒ' త్వము తలకట్టుస్థానమున ౧౧ అను ఒత్వ సంజ్ఞను జేర్చియు, ఏత్వఉత్వములను జేర్చియు రెండు రీతులుగ గలుగు చున్నది. అ + ఉ = ఒ కాని, ఎ + ఉలు 'ఒ' కానేరదు. కావున వీనిలోని రెండవ రూపములు విచిత్రములైనవి.

12. హకారముపై నచ్చులుగుణింతమున జేరునప్పుడు తలకట్టుస్థానమున నాయాచిహ్నముల జేర్చి యొకవిధముగను, తలకట్టును నిలిపి అడ్డుగడియ తుదిని జేర్చి మఱియొకవిధముగను రూపములేర్పడును. - ఇది హకారముపై నచ్చులు చేరువిధము.

13. ఘ, ఝ, లకు ఒ, ఓ, లు చేరునప్పుడు మూడేసి రూపములు:

i. తలకట్టు స్థానమున జేర్చి;

ii. తలకట్టును నిలిపి అక్షరము తుదికొమ్ముపై జేర్చి.

iii. తలకట్టును తొలగించి, ఎత్వ ఉత్వ సంజ్ఞలుచేర్చి.

14. మ, య, ల పై ఒ, ఓలు చేరునప్పుడు తలకట్టుస్థానమున జేరవు; మొ, యొ, మో, యో, అని యగును. ఒత్వము చేరునప్పు డత్వ ఉత్వములును, ఓత్వము చేరునప్పు డెత్వ, ఆత్వములును నీ యక్షరములపై జేరుట విసేషము.

15. ఐత్వము హల్లునకు సగముపైని, సగము క్రిందను జేరును.

(ఆ) హల్లులు.

1. కప్ప, ఉప్పాడ, కుప్పి, శ్రీ, గ్రుడ్డి, క్రూర, క్రేవ, మ్రోగు, అమ్ము, గుర్తు, కన్ను, మొదలగు వానిలోని సంయుక్తాక్షరములందచ్చులు క్రింది హల్లుతో జేరవలసియున్నను మీది హల్లుతో జేరియున్నవి; కప్పు, కొవ్వ మొదలగు పదములలోని సంయుక్తాక్షరములలో నుచ్చారణము ననుసరించి క్రిందిహల్లులతోడనే చేరియున్నవి.

2. అత్థిన్ - అని వ్రాయుట ప్రాచీనలేఖన క్రమము; అధిన్ యనుట మధ్యయుగము నాటిది; అర్థి యనివ్రాయుట నేటి యచ్చు యుగమున నేర్పడినది. ఉచారణమును బట్టి మూడును సరియైన రూపములు కావు. వరుసగ వాని యుచ్చారణములు అతిథ్‌ర్, అథ్‌ర్, అరిథ్, అని వ్రాతను బట్టి తేలుచున్నది.