పుట:Andhra bhasha charitramu part 1.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118. పెట్టు.

i. విశేష్యములపై : అంకిలి -; అడజడి -; అడ్డ -; ఆక -; ఆయాస -; ఆయిత -; ఆరట -; ఉత్తల -; ఊదర -; ఎక్కు -; ఎడ -; ఎత్తు -; ఎన్నిక -; ఎస -;; ఒర -; కక్కస -; కను -; కన్న -; కలగుండు -; కాఱియ -; కికు (క్కు)రు -; కుతిల -; కూ - (కూయి); కొల్ల -; గంటు -; గీ -; గుఱు -; గోడి -; చూ -(చూపు); చొక్కు -; తడ -; తత్తఱ -; తల -; తల్లడ -; తహతహ-; తిరి -; త్రోపుడు -; తోడు -; దందడి -; దబ్బు -; దు:ఖ -; నచ్చు -; నలగుడు -; నులి -; పంపు -; పరువు -; వాలు -; పీట -; పుట -; పెట్టె -; పెన -; పొద -; పొరలు -; పోకడ -; పోరు -; బలి -; బేలు- మట్టు -; మభ్య -; మాఱు -; ముడి -; ముదల -; మెలి -; మొదలు -; మో - (మోపు); మ్రాను -; లంకె -; లెక్క -; లొడ -; వట్ర -; వడి -; వెచ్చ - (= - ము); వెడ్డు -; వెద -; వెలి -; వేగిర -; వేడె -; సంత -; సరి -;

II. బహువచనరూపముపై : ఎక్కులు -.

iii. తుమున్నర్థకములపై : ఎండఁ -; కూడఁ -; తగులఁ -;

iv. విభక్తిరూపములపై : చక్కఁ -; జాలిఁ -; పేటనఁ -; వడిఁ -;

v. క్రియపై : జేపెట్టు

vi. అవ్యయములపై : పిఱు -; బహి -.

119. పెనగు.

విశేష్యములపై : మల్లు -.

120. పొంగు.

సంఖ్యావాచకముపై : ముప్పొంగు = మూడుపొంగులు పొంగు.

121. పొడుచు.

i. విశేష్యములపై : కికురు -; కిఱుకు -; కెరలు -; గగురు -; గుఱు -; చల -; నిట్ట -; పుల -; వెల్లి -;

ii. బహువచన రూపములపై : చిఱ్ఱలు -.

iii. క్త్వార్థకముపై : ఎత్తి -.

iv. అవ్యయముపై : తూ -.

122. పోయు.

i. విశేష్యములపై : ఆకు -; ఆను -; ఉరి -; కుట్టు -; చెమట -; తల (-పు); పాఱు -; పోగు -; బార -; వాస -.