పుట:Andhra bhasha charitramu part 1.pdf/222

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మబ్బు-; మలపు-; మల-; మల్లడి-; మస-; మాకొను (దీని వ్యుత్పత్తి తెలియలేదు); మాఱు-; ముంపు-; ముక్కు-(=ముందు, -ముఖము) ముట్టు-; ముట్టుకోలు-; ముడి-; మునుము-; ముప్పిరి-; మురి-; మెండు-; మెదుక-; మెలి-; మొగ-; మొదలు-; మొన-; రక్కు-(చూ. త్రెక్కు); రచ్చ-; రెక్కు- (చూ. రక్కు); లంగ-; రాగు-; లెక్క-; వడ-; వడి-; వల-; వలి-; వసి-; వాక్కు-; (ద్విత్వలోపము, ఒక; క-లోపము); వెంటి-; వెట్టి-; వెను-; వెన్నడి-; వెల్లి-; వ్రేటు-; సందడి-సందు-; నరకు-; సరమ-; సరి-; సుడి-; సూడు-; సేద-; సొమ్మ.

ii. హువచన రూపములపై: ఉవ్విళ్లు-; కవలు-; తెట్టువలు-; తెట్టెలు-; పల్లటీలు-; పెనకువలు-; వఱువట్లు-; మిఱుమిట్లు-;

iii. ధాతువులపై: అందు-; అచ్చు-; అడలు-; అడుగు-; అలము-; ఆ-గుబ్బు-; ఆడు-; ఇముడు-; ఉంచు-; ఉరలు-; ఎదురు-; ఏలు-; ఒంటు-; ఒత్తు-; ఒనవెట్టు-; ఒప్పు-; కూరు-; క్రేటు-; గదుము-; గిలుబు-; చుట్టు-; తగులు-; తారు-; తాళు-; తెఱ- (తెఱచు' లోని చు-లోపము); తేఱు-; తొట్టు-; తొలు-; దాగు-(-గు- లోపము); దాటు-; దా-; నడుము కట్టు-; నాటు-; నిండు-; నిలుచు-; నొచ్చు-; పండు-; పెంచు-; పెట్టు-; పొదలు-; బల- ('బలయు' లో యు-లోపము); బాదు-; బావు-; మసలు-; ముంచు-; ముద్దుపెట్టు-; ముసురు-; మూరు-; వాడు-; వీడు-; వేడు.

iv. క్త్వార్థములపై: ఆచి-; ఆడిపోసి-; ఎత్తి-: త్రిప్పి-; పుంజి-; పొట్టపోసి.

v. విభక్తిరూపముపై: పెనగొను.

vi. అవ్యయములపై: ఊ (-;కడు-; డీ-; దీ-; పరి-; పఱి-; మును-; మెయి-; మే-; మేలు-; మై-; లో-; సమ.

61. కొలుపు.

విశేష్యములపై: కై-; పురి.

బహువచన రూపములపై: గుండ్రలు.

ధాతువులపై: వీడు.