పుట:Andhra bhasha charitramu part 1.pdf/216

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


vii. అవ్యయములపై.

అల్లాడు; ఓలాడు.

12. ఆరు

1. విశేష్యములపై: ఏపారు, ఒప్పారు, చల్లారు, జంపారు, తనుపారు, తీపారు, తెలుపారు, నిండారు, నింపారు, నినుపారు, పెంపారు, పెనుపారు, పొంగారు, పొలుపారు, బెడగారు, వాచారు.

2. విశేష్యముల బహువచన రూపముపై: పొంపెసలారు.

3. క్త్వార్థకములపై: అడగారు, అణగారు, నిగిడారు.

4. ధాతువులపై: అలరారు, అసలారు, ఎలరారు, ఎసలారు, తనరారు, పొనరారు, వెలరారు.

13. ఆరుచు.

1. విశేష్యములపై: ఓదారుచు, నీరారుచు, పాలారుచు, పోకారుచు.

2. బహువచన రూపముపై: అంగలారుచు.

3. అవ్యయముపై: అల్లారుచు.

14. అఱు.

విశేష్యముపై: ఓటఱు.

15. ఆఱు.

విశేష్యములపై: గరుపాఱు, తెగటాఱు.

16. ఆఱుచు.

విశేష్యములపై: తెగటాఱుచు.

17. ఇచ్చు.

విశేష్యములపై: ఆనతిచ్చు, జట్టియిచ్చు, మొగమిచ్చు, వెన్నిచ్చు, సెలవిచ్చు.

18. ఇడు.

విశేష్యములపై: ఎక్కిడు, చొక్కిడు, పరువిడు, ముద్దిడు, మోపిడు.

19. ఉండు.

కూరుచుండు (దీనికి ధాతువేమో తెలియదు; 'కూరుచు' ధాతువైనచో 'కూరిచి+ఉండు' అని పదచ్ఛేదము; నిలుచుండు (నిలిచి+ఉండు);