పుట:Andhra bhasha charitramu part 1.pdf/215

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ii. బహువచన రూపములపై.

అబ్బాలు-; ఇగ్గులు-; ఈదులు-; ఊగులు-; ఎగురులు-; ఎగ్గులు-; ఏటులు-; నీలలు-; కనకనలు-; కాటులు-; కిలకిలలు-; కొట్టులు-; కొల్లలు-; క్రుమ్ములు-; గడగడలు-; గిజగిజలు-; గుంజులు-; గుజగుజలు-; గుదగుదలు-; గొణగొణలు-; గోరుపులు-; గోర్పిళ్లు, గ్రుద్దులు-; చిటచిటలు-; చిమ్ములు-; చిఱచిఱలు-; చూఱను-; జీరులు-; చెకపికలు-; చెఱచెఱలు-; చల్లులు-; తకపికలు-; తన్నులు-; తఱతఱలు-; తార్పులు-; తికమకలు; తిరితీపులు-; తచ్చనలు-; తుంపెసలు-; త్రోద్రోపులు-; దుముకులు-; దుముదుములు-; దేవులు-; దొమ్ములు-;నకనకలు-; నఱుకులు-; నేళ్లు-; పాతరులు-; పింపిసలు-; పింపిళ్లు-; పిరువీకులు-; పీకులు-; పెటపెటలు-; పెనగులు-; పోటులు-; ప్రాకులు-; బిత్తరములు-; మటమటలు-;మినమినలు-; మిలమిలలు-; ముఱముఱలు-; మెరమెరలు-; బుసబుసలు-;బెకబెకలు-; మొత్తులు-; మొఱమొఱలు-; లాగులు-; లుకలుకలు-; వందఱులు-; వాటులు-; వెంపరలు-; వక్కిరింతలు.

iii. క్త్వార్థకములపై సంధిలేకుండ.

అసియాడు, ఉరియాడు, ఒత్తియాడు, కెరలియాడు, కొనియాడు, దోగియాడు, త్రిప్పియాడు, త్రుళ్లియాడు, నుఱిచియాడు; విసరియాడు; వీగియాడు.

iv. క్త్వార్థకములపై సంధిగలిగి.

ఊగాడు; ఊవాడు; ఊటాడు; ఎక్కాడు; కదలాడు; కొండాడు; ఇచట 'కొండు' అనునది 'కొళ్‌' అను ద్రావిడధాతువు క్త్వార్థక రూపము; తెనుగున ప్రాచీనరూపము, ;కొనియాడు' నకు రూపాంతరము; కోరాడు; గునిసాడు; చెండాడు; చెరలాడు; చరలాడు, తట్టాడు, తట్టుముట్టాడు; తారాడు; తిరుగాడు; తునుమాడు, తూగాడు, తూటాడు; తూలాడు, తేలాడు; తొలకాడు; దోగాడు; పాఱాడు; పెనగాడు; పొదలాడు; పొరలాడు; పొలసాడు; పోనాడు; మట్టాడు; మిట్టాడు; వడకాడు; వ్రేలాడు;

V. ధాతువువై 'కొను' నకు రూపాంతరమగు (క) చేరి.

జీరుకాడు, పారుకాడు.

vi. తుమున్నర్థకములపై.

చెడన్-; డి(ది)గ(గ్గ)న్-; విడన్.