పుట:Andhra bhasha charitramu part 1.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. అను.

ఇది సాధారణముగ ధ్వవ్యనుకరణ శబ్దములపై జేరును. ఇదిచేరునప్పడు కొన్నియెడల 'మ' గాని, రేఫముగాని యాగమసంధ్యక్షరముగ వచ్చును.

'మ' ఆగమము: కనకనమను, గిటగిటమను, గుబ్బుమను, గ్రుక్కుమిక్కుమను, చిటచిటమను, చిటుకుమను, చిటుకుపొటుకుమను, చిఱ్ఱుమను, జల్లుమను, దగదగమను, దడదడమను, దొనదొనమను, పెటపెటమను, బగ్గుమను, బావురుమను, మినుకుమినుకుమను, ముఱముఱమను, ముసముసమను, మిసమిసమను, రెపరెపమను, లొటలొటమను.

రేఫాగమము: గుబ్బురను, చిటుకురను, జల్లురను, దిగ్గురను, మినుక్కురను.

మ,ర, రెందును నాగమము: చివుక్కురుమను.

ఆగమములేక: గుటుక్కను, గ్రుక్కుమిక్కను, చిటుకను, చిటుక్కను, జల్లను, డమ్మను, మిడుకుమిడుకను, మినుమినుకను.

అకారాంతములపై యడాగమము: పెళపెళయను.

9. అఱు.

విశేష్యములపై: ఉక్కఱు, ఓటఱు, పాడఱు, రూపఱు, సిగ్గఱు.

10. ఆడించు.

విశేష్యములపై: బోరుకాడించు, వంచాడించు.

11. ఆడు.

ఇది విశేష్యముల యేకవచనముల మీదను, గొన్నియెడల బహువచనముల మీదను, ధాతువుల క్త్వార్థక తుమర్థక రూపములమీదను జేరుచుండును. కొన్నియెడల నవ్యయముల మీదను జేరును.

i. విశేష్యముల యేకవచనములపై.

అఱ్ఱాడు, ఆటాడు, ఈడాడు: ఉడుకు -; ఉడ్డ -; ఉలివు -; ఉల్లసము -; ఎగ్గు -; ఎదురు -; కొట్టు -; కొల్ల -; కోడు -; క్రోడు -; గండు -; గినుము -; గిలుబు -; గోజు -; గోడు -; చిందు -; చిట్ట -; చిఱ్ఱుముఱ్ఱు; చెండుబెండు -; చక్కు -; చరలాటము -; చూఱ -; జంపు -; జగడము -; జలకము -; జూటు -; తడవు -; తిట్టు -; త్రోపు -; దాడి -; నట్టు, నడ -; నఱుము -; నీరు -; నుగ్గు -; నుఱుము -; నెయ్యము -; పనుపు -; పాలు -; పీకువీకు, పిండిలి -; పేటు -; పోక -; పోరితము -; పోరు -; బాస -; బోరుకు -; మండ్ర -; మల్ల -; మాట -; మాఱు -; ముద్దు -; మేత -; మేలము -; మొడాడు -; ఱంకు -; ఱవ్వ -; వాదు -; వీడుజోడు -; వెన్ను -; వెరజు -; వేటం.