పుట:Andhra bhasha charitramu part 1.pdf/212

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


28. - మానము ; సం. - మాన.

తేమానము, వరుమానము.

- బడి, - వడి, వణి, వళి, - ఈ ప్రత్యయములన్నియు నేకార్థకములును నొకటితోనొకటి సంబంధించినవియునై యున్నవి. ఇవి సంస్కృతములోని 'వృత్తి' అను శబ్దము వికారములు. 'వృత్తి' ప్రాకృతమున 'వణి, వళి' గామాఱును, ఉత్తరహిందూస్థాన భాషల యందీ ప్రత్యయములున్నవి.

- మతి, -మానము, - అనునవి సంస్కృత ప్రత్యయములే తెనుగు ననునున్నవి.

- మర, - ఇది 'మతి' శబ్దభవమై యుండనోపును.

29. - బరము ; సం. - వర ; వృత్తి ; చూ. సం. కలేబరమ్.

లేబరము.

30. - బళి; సం. - వృత్తి; వత్ + ఇక.

చాగుబళి (మను. V. 42).

31. - మాలము. సం. ప్రా. - ఆల : కలిగినది.

లూలామాలము.

32. - రి (ఱి)కము ; సం. అర : కలిగిన + ఇక.

ఇల్లరికము, ఎబ్బెఱికము, ఎఱబఱికము, ఒప్పరికము, కన్నెఱికము, కోడంట్రికము, కోట(డ)ఱికము, చిన్నఱికము, చేతరికము, చుట్టఱికము, తొత్తఱికము, దాపఱికము, నెప్పఱికము, దొంగఱికము, నిబ్బరికము, పిన్నఱికము, పెద్దఱికము, పేదఱికము, బాపఱికము, మిండఱికము, మేనఱికము, లంజెఱికము.

33. - వరము; సం, - అర - కలిగిన

i. భావార్థము:-

ఉలవరము, కలవరము.

ii. ఇతరార్థములు:-

ఇలువరము (ఇలావరము,) = ఇలువారము.

34. వల, - పల ; సం. - వృత్త

ఈవల, ఆవల, ఏవల, ఎవ్వల, దాపల, లోపల, వలపల, వెలుపల.

35. - వాయి ; సం, - ఉక + ఇక.

తరవాయి, తరువాయి, దిగువాయి, వఱువాయి.