పుట:Andhra bhasha charitramu part 1.pdf/201

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పవళింత, పుకిలింత, పుక్కిలింత, పుడికిరింత, పుడిసిలింత, పుణికిరింత, బిబ్బరింత, బుజ్జగింత, బొబ్బరింత, సకిలింత, సగిలింత, సవరింత, సళుపరింత, సోలింత.

62. -ఇద; సం. ఇ + త.

మాడిద [సూ(చూ)డు];

63. -ఇదము; సం. ఇ + - త.

i. ఎల్లిదము, ఏలిదము, ఒప్పిదము, క్రొవ్విదము, తప్పిదము.

ii. చిన్నిదము (స్వర్ణితమ్); పెల్లిదము (పెల్లు); బెట్టిదము (బెట్టు); మెడిదము (*మెడు).

64. -ఇది; సం. ఇ + తి.

ఉఱిది (ఉఱు)

65. -ఇపము; సం. ఇ + ఆస్తిక.

మురిపము (*మురు); వ(వె)లిపము (వెల).

66. -ఇపి; సం. ఇ + ఆప్తికా.

బుడిపి, బుడ్పి.

67. -ఇంపు; సం. ఆప్ + ఉ + క.

ఆమతింపు, ఆరగింపు, ఇవతాళింపు, ఒంటింపు, ఓరసింపు, కుమ్మరింపు, గుండ్రింపు (ఘూర్ణ్). గోరింపు; చెంగలింపు; తాలింపు, తులకింపు, పట్టింపు, పలుకరింపు, బుడ్డగింపు, బెదరింపు, బెల్లింపు, బోడింపు, మందలింపు, మదింపు, ముగింపు, మొక్కలింపు, రూణింపు, సడింపు, సెగ్గింపు, హవణింపు.

68. -ఇమ; సం.-ఇమన్.

మొటిమ.

69. -ఇమము; సం. ఇమన్.

కలిమము, దలిమము.

70. -ఇమి; సం. ఇమన్ + ఇకా.

అరిమి (అరు); ఒడ్డిమి (ఒడ్డు); ఓరిమి (ఓరు); ఓలిమి (*ఓలు); కలిమి (*కలు); కూరిమి (కూరు); తాలిమి; తాల్మి, (*తాలు); నేరిమి (నేరు); పోడిమి, పోణిమి (పోలు); బడిమి (బడి); బ్రదిమి (*బ్రదు); మాలిమి (మాలు); మిసిమి (మిసుము); వేలిమి (వేలు);

ii. తద్ధితము: