పుట:Andhra bhasha charitramu part 1.pdf/200

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


61. ఇజము; సం.-య.

బేడిజము.

62. ఇడి; సం.-ఇ+తి.

i. కృత్తు.

అలికిడి (అలుకు); ఒత్తిడి (ఒత్తు); తెలివిడి (తెలి); నిఱిపిడి (నుఱుపు); నూఱిపిడి (నూఱుపు);ప్రామిడి (ప్రాము); రాపిడి (రాచు); రాయిడి (రాయు).

ii. స్వార్థము.

ఉలిమిడి (ఉలుము); బచ్చిడి (బచ్చు); ఒరపిడి (ఒరపు); మడిమిడి (కడుము); కురిమిడి (కురుము); గెలివిడి (క. గెలివు); గొలిమిడి (గొలుము); చప్పిడి (చప్ప); చలిమిడి (చలుము); చిరిమిడి (చిరుము); చిలిమిడి (చిలుము); చీమిడి (చీము); తూర్పిడి (తూర్పు); పంగిడి (పంగు); పసిడి (పసుము); పసిమిడి (పసుము); బలువిడి (బలుపు); మామిడి, మావిడి (మావు); వలిమిడి (వలుము); వెలిమిడి (*వెలుము).

iii. న్యూనార్థము.

ఉప్పిడి (ఉప్పు); తలవిడి (*తలపు); దోయిడి (దో); ముక్కిడి (ముక్కు); లోతిడి (లోతు); వాలిడి (వాల).

63. ఇత సం.-ఇ+త.

i. కృత్తు.

పొగడిత (పొగడు).

ii. తద్ధితము.

లొడిత.

64. ఇతము; సం.-ఇతమ్.

ఆయితము, ఆయిత్తము, ఇంపితము, పంచితము, పోరితము, బిగితము, మప్పితము, మలికితము, సలితము

65. ఇంత; సం-అస్త.

దీనిని చేర్చునప్పుడు సంధియందు వివిధాగమాక్షరములు వచ్చును, అప్పగింత, ఆకలింత, ఆవులింత, ఇగిలింత; ఇచ్చగింత, ఉప్పిరింత, ఎకిరింత, ఎక్కిరింత, ఎచ్చరింత, ఒప్పగింత, ఓకిలింత, ఓసరింత, కలవరింత, కిక్కురింత, కికురింత, కుసిలింత, కేకరింత, కొక్కరింత, క్రుళ్లగింత, గిలిగింత, గిగిలిగింత, చికిలింత, చక్కిలిగింత, చాగిలింత, చౌకళింత, జుడికిరింత, డాగురింత, త్రుళ్లగింత, త్రుళ్లింత, త్రుళ్లుమింత, దాగురింత, పటికిరింత, పలుకరింత, పల్కరింత,