పుట:Andhra bhasha charitramu part 1.pdf/199

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(చాఱ); నాడిక (నాడు);పసిక (పస); పసిరిక (పసరు); పెంచిక (పెంచు); పెంతిక, పెంట్రిక (పేడ); పొనిక (పొన్న); బీటిక (బీట); బెత్తిక (బెత్తు); బొమిడిక (బొమిడ); బొమ్మిక (బొమ్మ); బోడిక (బోగు); మచ్చిక (మచ్చు); మూదలిక (మూదల); లత్తిక (లత్తు); వాలిక (వాలు); సానిక (సాన); హవణిక (హవణు).

వైకృతములు.

అమ్మిక (అంబిక); ఇటిక, ఇట్టిక (ఇష్టిక); ఎండ్రిక (ఎండ్ర); ఏడు); ఏనిక (కన్నడము:ఆనె); కేళిక: కటిక; కట్టిక (కాష్టిక); కొండిక (*కొండ); కొటిక, కొట్టిక (కోష్టిక); గండిక, గండ్రిక (ఖండిక); చిటిక (చిట్ట); చందిరిక (చంద్రిక); చదిరిక (చదర); జంతిక (యంత్రిక); జమలిక, జమళిగ (యమళ); జవనిక (యవనిక); పటిక (స్ఫటిక); పరామరిక (పరామర్శిక); పల్లిక (పల్ల); పాచిక, పాసిక (పాచు); పుటిక, పుట్టిక (పుట); పొత్తిక (పొత్తు); బదనిక, పదనిక, బవనిక (బదను); బుట్టిక (పుట); మన్నిక (మాన); మళిక (మాళ); మిత్తిక (మృత్తిక); విన్నపత్రిక (విజ్ఞాపన పత్రిక); వైసిక (*వైసు); సంచిక (సంచయ); హామిక (హాము).

57. ఇకము; సం - ఇక.

ఒడికము=ఒద్దికము (ఒందు. *ఒద్దు);

కందళికము (కందళ); సలికము (స్వల్ప+ఇకము)

కలికము, కారికము, నలికము, బాసికము, బొమికము, బొమ్మికము, బొమ్మిడికము.

58. ఇకి; సం.-ఇక+ఇక.

i. కృత్తు.

చూడికి (చూడు); ఉనికి (ఉను); పూనికి, పూన్కి (పూను); పోలికి, పోల్కి (పోలు); మనికి, మన్కి (మను); వినికి (విను); వెలియునికి.

ii. తద్థితము.

ములికి (ములు).

59. ఇగ; సం.-ఇక.

ఒడ్డిగ (ఒడ్డు); నచ్చిగ (నచ్చు); నమ్మిగ (నమ్ము).

60. ఇగము; సం.-ఇకమ్.

ఊడిగము, ఉడిగము, కోడిగము, మండిగము, వల్లిగము, సూడిగము.