పుట:Andhra bhasha charitramu part 1.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

53. -ఆలము; సం. ఆల-సంబంధించిన.

బైడాలము; వింటాలము.

54. -ఆళము; సం. ఆల-సంబంధించిన.

కాతాళము, పిసాళము, సుమాళము, సురాళము.

55. -ఇ

ఇప్రత్యయాంత శబ్దములను సరిగ నేర్పఱుచుట కష్టమే అవి కేవలము ఇప్రత్యయాంతములో, హల్లుతో ఇ-కారము చేరిన ప్రత్యయములు గలవో ఏర్పఱుచు కొనవలయును. ఇకారాంత శబ్దముల పదప్రత్యయ విభాగ మాయా సందర్భములందు చేయబడును.

56. ఇక. సం.-ఇక.

i. కృత్తు.

అమరిక (అమరు): అలయిక(అలయు); అల్లిక (అల్లు); ఆడిక (ఆడు); ఆనిక (ఆను); ఇమడిక (ఇముడు); ఈనిక (ఈను); ఉరమరిక (ఉరమరు); ఊనిక (ఊను); ఎడయిక (ఎడయు); ఎనయిక (ఎనయు); ఎనిక (ఎను, ఎన్ను), ఎన్నిక (ఎన్ను); ఎసలిక (ఎసలు); ఏలిక (ఏలు); బందిక (*బందు); ఒడబడిక (ఒడబడు); ఒద్దిక (*ఒద్దు, ఒందు); ఒనరిక (ఒనరు); ఒమ్మిక (ఒమ్ము);ఓడిక (ఓడు); ఓపిక (ఓపు); కదలిక (కదలు); కలయిక (కలయు); కానిక (కాను); కుదిరిక (కుదురు); కుదిలిక (కుదులు); కూడిక (కూడు); కెడయిక (కెడయు); చిమిడిక (చిముడు); చీరిక (చీరు); చీలిక (చీలు); చాలిక (చాలు); చేరిక (చేరు);తాలిక (తాలు); తాళిక (తాళు); తీఱిక (తీఱు); తూనిక (*తూను),తెరలిక (తెరలు); తేలిక (తేలు); తొడరిక (తొడరు); నచ్చిక (నచ్చు); నమ్మిక (నమ్ము); నెరయిక (నెరయు); పన్నిక (పన్ను); పాలుమాలిక, పాల్మాలిక, ప్రాలుమాలిక, ప్రాల్మాలిక (పాలుమాలు, ప్రాలుమాలు); పూనిక (పూను); పొంచిక (పొంచు); పొందిక (పొందు); పొగడిక (పొగడు); పొదలిక (పొదలు); పొరలిక, పొర్లిక (పొరలు); పొలయిక (పొలయు); పొలియిక (పొలియు); పోలిక (పోలు); బడలిక (బడలు); బతిమాలిక (బతిమాలు); మలయిక (మలయు); మసలిక (మసలు); మాసిక (మాయు,* మాసు); మూసిక (మూయు,*మూసు); మోపిక (మోపు); సొలయిక (సొలయు); హెచ్చరిక, ఎచ్చరిక (హెచ్చరు, ఎచ్చరు); తోపిక; (తోపు); సొగయిక (సొగయు); వాడిక (వాడు).

ii. తద్ధితము.

అఱ (ర) మఱి (రి) కరు [అఱ (ర)మ(ఱు)].

ఆమిక (ఆము); ఇగరిక (ఇగరు); కచ్చిక (కచ్చు); ఖండిక, ఖండ్రిక (ఖండ); గమనిక (గమన); చెందిరిక; చెంద్రిక (చెంద్ర=చంద్ర); చాఱిక