పుట:Andhra bhasha charitramu part 1.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కమ్); వాయము (వ్యర్థమ్);సాకము (సాకు); సెగ్గము (సెగ్గు); పదటము (పదటు).

22. -అర; సం.-కర;

పప్పర (పర్పర);మసర (మషీకర); చూ. దూసర.

23. -అరము; సం. -కర.

i. కృతు:

ఇంటరము, ఇంట్రము, (ఇఱి); ఈండ్రము (ఇడు): ఎచ్చరము (ఎచ్చు); దాపరము (దాచు, దాపు); మిణకరము (మిణుకు; వాచరము (వాచు).

ii. తద్ధితము;

ఎత్తరము (ఎత్తు); ఒంటరము (ఒంటు); ఒత్తరము (ఒత్తు); కప్పరము (కప్పు); కావరము (కావు); కోటరము, కోట్రము (కోడ); డెప్పరము (డెప్పు); తీంట్రము (తీట); తీండ్రము (తీక్ష్ణము); తూపరము (తూపు); తెక్కరము (తెక్కు); దాపరము (దాపు); దెప్పరము (దెప్పు); నెప్పరము (నెప్పు); పోతరము (పోతు); పోసరము (*పోసు=పోతు); మంబరము (మంబరు); పట్టరము (పట్టు); వేండ్రము (వేడి); వేకరము (వేకి); సీదరము (*సీదు); సాగరము (సాగు); పెడసరము (*పెడసు).

24. -అరి; సం. - కారికా.

అలపరి (అలపు); కరకరి (కరకు); దళసరి (*దళసు. చూ. పెళుసు); మనసరి (మనసు).

25. - అఱము; సం. - కర.

ఉల్లఱము (ఉల్ల).

26. -అల;-ఆల;-ఏల; సం.-త;- ఇత.

ఊయల, ఊయాల; ఊయెల, ఊయేల, ఉయాల, ఉయేల, ఉయ్యల, ఉయ్యాల, ఉయ్యెల, ఉయ్యేల (ఊచు సం. ఉజ్ఘిత,)

27. -అలము. సం. త-, ఇత; ప్రా.-ల,-ఇల్ల.

కొందలము (కుందు).

ఇట్టలము (*ఇట్టు); ఉమ్మలము (ఉమ్మ); కావలము (కావు); నిట్టలము (నిడు); మొక్కలము (ముష్కరము); వెగ్గలము (వెగ్గు, వెచ్చు).

28. -అలి; సం.-తి.

కావలి (కాచు,*కాపు); కూడలి (కూడు).