పుట:Andhra bhasha charitramu part 1.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

II.25); వెలవెలని (వేం. పంచ. పు. 61).

18. అనము ; సం. అన.

i. కృత్తు.

ఒడ్డనము(ఒడ్డు); ఒప్పనము (ఒప్పు); కొట్నము (కొట్టు); చిమ్మనము (చిమ్ము); నాట్నము (నాటు); సాపనము (సాపు); పొంతనము (పొందు); పోసనము (*పూసు=పూయు).

19. అపము; సం. ఆప్తిక, లేక, ఆపిక.

i. కృత్తు.

పొలపము (పొలుచు); మొరసము (*మొరచు=మొరయు).

20. అమి; సం. ఇమన్.

i. కృత్తు.

ఈఱమి (*ఈఱు); ఎడ్డమి (*ఎడ్డు); ఎలమి (ఎలయు); ఓటమి (ఓడు); కూటమి (కూడు); పైకూటమి

ii. తద్ధితము.

మొల్లమి (మొల్ల); లేమి (*ఇల్).

iii. వ్యతిరేకార్థము.

ఒప్పమి (ఒప్పు); ఒల్లమి (ఒల్లు); చాలమి (చాలు); తీఱమి (తీఱు); నేరమి (నేరు); పోరామి (పోవచ్చు); కొఱగామి, చూపోపమి, వచ్చు రాములు.

21. అము. సం. అమ్.

i. కృత్తు.

అమరము (అమరు); ఆరటము (ఆ=రట్); ఆరడము (ఆ+రట్); ఆవటము (ఆపాతమ్); ఇక్కము (ఇఱుకు); ఎడ్డము (*ఎడ్డు); ఒగ్గము(ఒగ్గు); ఓటము (ఓడు); కారాకూరము; పైసరము (పైసరు); కూటము (కూడు); తూకము (తూగు); బాదరము (బాదరు); బిత్తరము (అభ్యంతరమ్); మేళము (మిళ్); రపము (రప్); రెప్పము (రెప్పు); వాకము, వాటము (పాతమ్); వెంటము (వేడు); వ్రేకము (వ్రేగు); సోలము (సోలు); మలచము (మలచు); ఓహటము (అవహతమ్); బజాఱము (బజాఱు); వగరము (వగరు).

ii.తద్ధితము:

ఊతము (ఊత); జోతము (జోత); తీయము (తీ, తీయ్స్); నొక్కము (నొక్కు); మవ్వము (మృదుత్వమ్); మేలము (మీల్); మైకము (మద