పుట:Andhra bhasha charitramu part 1.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

I. కేవల ప్రత్యయములు.

1. తెనుగు: అ; సం. అ; ప్రా. అ.

i. భావార్థక ప్రత్యయము: కృత్తు

ఇది చేరునప్పుడు ధాతువుతుది సరళము పరుషమగును; రేఫము టకారమగును. ఉదా. ఎఱుగు-ఎఱుక;ఊగు-ఊక; కదగు-కడక; కాగు-కాక; కూయు, కన్నడము; కూగు-కూక; ఊఱడు-ఊఱట; ఓడు-ఓట; కూరడు-కూరట; తివురు-తివుట; తిమ్మరు-తిమ్మట; వసరు-వసట; వేసరు-వేసట; తెరలు-తెరల; నిలు-నేల; పీలు-పీల; నెప్పు-నెప; ఉసలు-ఉసల.

2. అక; సం. అక; ప్రా. అ అ

నిలక (నిలు); తానుపోక=పోవుట (నిర్వ. vi. 21; iv. 4, 7); రాక (నిర్వ. iii. 49) అఱక (అఱ్ఱు); అమరేంద్రుమీద రాక, హరి పట్టువడి పోక (నిర్వ. vii.2)

3. అకము; సం. అకమ్.

i. భావార్థము.

అమరకము (అమరు); అమ్మకము(అమ్ము); అఱకము(అఱు); ఎసకము(ఎసగు); ఒఱకము (ఒఱగు); కాటకము (*కఱు, చూ. కఱవు); కాయకము (*కాయు), కుందకము (కుందు); చల్లకము (చల్లు); తోమకము(తోము); నమ్మకము (నమ్ము); పంచకము(*పంచు); పంపకము(పంచు); పన్నకము(పన్ను); నమ్మకము(నమ్ము); పరాచకము(పరిహాసము); పాటకము(పాటు); మసకము(మసగు); మాఱకము (మాఱు); సజ్జకము (*సజ్జు);

ii. స్వార్థము.

కీలకము (కిలు); తమకము (తమకు=తమస్+క); నవకము(*నవకు+నవ్యక); బరకము (*బరకు=భారక); బూటకము (*బూటు=వ్యర్థక); వాలకము (*వాలు=వాదక);

4. అగము. సం. అకమ్.

బుజ్జగము (*బుజ్జు=బుధ్);

5. అంటరము; సం. అస్త.

ఇల్లంట్రము (ఇల్లు); కోదంట్రము (*కోడ); పేరంట్రము (పేరు+పెద్ద)

6. అట; సం. అత; ప్రా. అత.