పుట:Andhra bhasha charitramu part 1.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంగాళీ, హిందీ, మొద. *ఉఠ్=ఉత్+స్థా=తెనుగు; ఉట్టు, ఉట్టిపడు, ఊట, ఊటించు మొద.

బంగాళీ;ఆచాఱ్=ఆ భర్ద్= తెనుగు: ఆచ్చాళు, బంగాళీ: ఉలహ్, ఉల్, ఉర్=ఉద్+లభ్=దిగి; తెనుగు. ఉఱియు, ఉలియు; బంగాళీ: నిహాల్, నిభాల్=ముగియు, సం. నిర్+వృత్=తెనుగు: నెగడు, నెవడు, మొద.

తెనుగున నుపసర్గములు.

సంస్కృతమునందలి యుపసర్గముల రూపముగలవి కొన్ని తెనుగునను నితర ద్రావిడభాషలయందును గలవు. ఇండో-యూరోపియను భాషలలోని యుపసర్గములకును వీనికిని బోలికలేదనియు సాధారణముగ 'మేల్కొను, కీడ్పడు' మొదలగు క్రియలయందలి 'మేల్=మీదు; కీఱ్=క్రిందు', అను నర్థములుగలవే ద్రావిడభాషలయం దున్నవనియు, నిట్టిశబ్దము లుపసర్గధాతువుల సంయోగమువలన గలుగక విశేష్యధాతు సంయోగమువలన గలిగినవనియు, కాల్డ్వెలుపండితు డభిప్రాయ పడియున్నాడు. ఈ యభిప్రాయమునుగూర్చి యాలోచించుటకు బూర్వము తెనుగున నుపసర్గములవలె గాన్పించువాని నొకచో జేర్చుట యుక్తము.

1. అందు:- అందుబాటు, అందుబడి=సమీపము. ఇది స్థలవాచకమగు విశేష్యముగాని, గ్రహణార్థకమగు 'అందు' అనుక్రియగాని కానేరదు. ఇది సంస్కృతములోని 'అధి'ని బోలియున్నది; పై రెండుపదములును 'అధిపాత' శబ్దభవములై యుండవచ్చును.

2. అడ్డ:- అడ్డకత్తి, అడ్డకమ్మి, అడ్డగాలు, అడ్డచాపు, అడ్డపట్టు, అడ్డపట్టె, అడ్డపాప, అడ్డబాస, అడ్డమాను, అడ్డవాట్లు, అడ్డవాతియమ్ము, అడ్డవేడెము, అడ్డసాళులు, అడ్డాదిడ్డి మొద. వీనిలో 'అడ్డ-'కు నిరోధమను నర్థములేదు.

3. అఱ:- అఱచేయి, అఱకాలు, అఱగొండెతనము, అఱగొడ్డియము, అఱజాతి, అఱమర, అఱవఱలు మొద. వీనిలో 'అఱ'కు సగము, కొఱత, అనునర్థములుగాని 'అఱుగు=జీర్ణించు, క్షయించు' అను క్రియయర్థములు గాని లేవు.

4. అసి:- i. అల్పార్థకము: అసికోత, అసిగాయము;

ii. ఇత్యర్థకము: "అసియఱచేత నాతడటు లాపొసనంబును బట్టుకొన్న న,య్యినుకటె చేటలంజెరిగి యింపగుబియ్యముచేసి వేడ్కతో, నెసరులువోసి వండ వెరవేర్పడ నయ్యశనంబు భూదివౌ, కసులకుబెట్టె గన్ దనిసి గ్రక్కుననాకలి దీఱునట్లుగన్." (-భోజరా. vi.)