పుట:Andhra bhasha charitramu part 1.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13. పరి-పరుండు=పర్యుషిత; పరిడవిల్లు=పరిష్ఠాత; పల్లటిల్లు=పర్యస్త; పరిక=పరిగ=ప్రదక్షిణము(శ. ర. లో ంరగ్గు అను నర్థము తప్పు.)

ఉ. "తిరుమల, కంచి, పుష్పగిరితీర్థములం జని కొంగుముళ్లతో వరములు దంపతుల్ వడయ వారక కాన్కలువైచి యంతటన్, బరికలు, దృష్టి దీపములు పన్నినగద్దలు బెట్టి యేమిటిన్ గరమగు పుత్రవాంఛ కడగానగ లేక విచారఖిన్నులై. హంస. 2. ఆ.) పరిచాళిక=పరిసారిక, ఒకమల్ల బంధము; పరిడవము=పరిస్థాపనమ్;

14. ప్ర-పసగు=ప్రసృ; పొగడు, పొవడు=ప్రగీత, ప్రకృష్ట; పంపు=ప్రాస్, ప్రజ్ఞాప్; ప్రబ్బు, పంబు, పమ్ము, ప్స్రువు, పర్వు, పాఱు=ప్రవృత్, ప్రవహ్, ప్రవద్; పులుము=ప్రలుంప్; పదను=*ప్రదను= ప్రతను=వాడి.

15. వి-బెళుకు, మెలకు, మెఱపు, వెలుగు, పెలయు; వెలుగు, ఎలరుచు=విలస్; విసుగు=వ్యస్? ఏడుచు=విలప్; ఏమఱచు=విస్మృ; విప్పు=*వ్యస్; బిగియు=వికృష్, వికృశ్; బెడయు=విధృష్; బెలయు; బెరయు=విరచ్; విరియు=విరిచ్; వేసరు, వేసారు=వ్యస్, విసృ; ఏమరిల్లు=విస్మృత.

16. సం-సమకూరు, సమకుఱు, సమకూడు, సమకోలు, సమకట్టు=సం=కృ.

17. సు-సొలయు, సొలపు, సొలయిక=సు+అలస్; పొన్ను, హోన్ను=సువర్ణ.

18. ప్రతి-పయ్యెర, పయ్యర, పైర=ప్రతిచార; పయి, పై=ప్రతి; (పైమాట. మొ.)

19. పర.-పరచి=పరశ్రీ; పఱ=పర; గొప్ప=ఉ. పఱమొయిలు, భార. విరా. 4. ఆ; పఱమబ్బు, రుక్మాం 5 ఆ.

20. అభి-ఈ యుపసర్గము చేరి వికారము నొందిన తెలుగుపదములు కాంపించలేదు: 'బిత్తరము' అనుపదము 'అభ్యంతర' శబ్దభవమగునేమో.హిందీలో దీనికి 'భీతర్‌' అని రూప మున్నది.

పై జూపిన పదములన్నియు శబ్దరత్నాకరమున దేశ్యములుగా నిరూపింపబడినవి. సంస్కృతధ్వనులు ప్రాకృతభాషలయందు పొందిన మార్పుల ననుసరించి యింకను నెక్కుడు ధాతువుల నిట్టివాని నేర్పఱింప వచ్చును.

తెనుగునందువలెనే నేటి య్యాభాషలయందును నుపసర్గతో గూడిన ధాతువులు వికారము నొంది క్రొత్తధాతువు లయినవి. ఉదా