పుట:Andhra bhasha charitramu part 1.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్; ఉప్పరించు, ఉప్పరించు=ఉత్ల్పు; ఊకించు=ఉత్కృ, ఉత్సహ్+కృ; ఊటించు=ఉత్థ్సా; ఉచ్చు=ఉత్‌చ్యు; ఊటు, ఊడు=ఉద్వర్త్, ఉత్థ్సా; ఉత్పతిత, ఉత్పాదిత, ఉత్పాటిత; ఊరడు=ఉచ్ఛ్వసిత; ఒత్తు=ఉద్ధత, ఉద్-ధ్మాత; ఊపు=ఉత్థాప్;ఉడుపు, ఉలుపు=ఉద్ధత, ఉద్ధృత, ఉపహత; ఉనుము=ఉద్యమ్; ఉరియు=ఉద్రిచ్; ఉలియు=ఉద్రన్; ఒలయు=ఉల్లస్; ఉదరు=ఉద్ధృష్; ఊఱడిల్లు=ఉచ్ఛ్వసిత; ఊసడిల్లు=ఉత్సరిత, అపసరిత, అవసరిత;ఒడ్డగిల్లు, ఒత్తగిల్లు, ఒత్తిల్లు, ఓరగిల్లు=ఉద్ధృత, అపహృత, ఉపహృత, ఉపహత, అపహత, అపహృత; ఉక్కణము=ఉత్కట; ఉక్కరి=ఉద్+కారిన్; ఉక్కిరి బిక్కిరి=ఉత్కృత. భీకృత, ఉక్కివము=ఉత్కృతమ్; ఉక్కస=ఉత్కాస; ఉత్తలము=ఉద్+త్వరమ్; ఉదురు, ఉదుటు= ఉద్ధృతమ్; ఉప్పలి=ఉత్పాత:; ఉల్లసము=ఉత్త్రాసం, ఉత్ప్రాసం; ఉవ్విళులూరు=ఉద్విజ్; ఉసురు=ఉచ్ఛ్వాస.

9. ఉప-ఒసగు=ఉపాస్, ఉడుగు=ఉపహత+కృ; ఒనరించు=ఉపపద్; ఒడ్డు=ఉపహిత; ఒత్తు=ఉపహత, ఉద్ధత, ఉద్వర్తిత; ఒందు=ఉపపద్; ఊపు=ఉపహృ; ఉలుపు, ఉడుపు=ఉపహత, ఉద్ధత, ఉద్ధృత; ఒరుము=ఉపక్రమ్; ఒనరు, మొనరు=ఉపపన్న; ఒడ్డగిల్లు, ఒత్తగిల్లు, ఒత్తిల్లు, ఓడిగిల్లు, ఓరగిల్లు=ఉపహృత, ఉపహత, అపహృత, అపహత, అవహృత, అవహత; ఒల్లగిల్లు=ఉపహృత; ఓడు, ఓటిల్లు, ఓహటిల్లు=అవహృత, అవహత, ఉపహృత,ఉపహత; ఉపతాయి=ఉపంథాయిర్.

10. దుర్-దురపిల్లు=దుర్+రట్; దూబఱ=దుర్భర; దూబ=దుర్బల.

11. ని-నీగు=నివృత్; నిట్ట, నిట్ర=నిష్ఠా నిలుచు=నిష్ఠా; నేటు=నిష్ఠా=నిశ్చయము, దృడము.

12. నిర్-నిక్కచ్చి=నిష్కృతి; నిక్కము=నిష్కృతమ్; నిక్కల=సం. నిష్కర్షణ; ప్రాకృతము=నిక్కాల; దీనికి శ. ర. లో (నిక్కము+కల అని వ్యుత్పత్తి చెప్పబడినవి. ఉదా. "నాకలనిక్కలయయ్యెడు శోకింపకుమమ్మ" అని యీబడినది); నిగుడు, నివుడు, నెగడు, నెవడు=నిర్హాపిత, నిర్వృత, నిర్వృత్త, నిగ్గు, నెగ్గు=నిర్వహ్+కృ; నిట్రు, నిట్టు=నిర్; నిట్టుపాసము, నిట్రుపాసము, అనువానిలో; నిప్పస్తు=నిరుపోషిత; నిబ్బరికము=నిర్భరికమ్; నిమురు=నిర్మజ్; నిముకు=నిర్మచ్; నిలుగు, నీలుగు=నిర్వృత+కృ; నివ్వెఱ=నిర్విణ్ణ; నెమకు=నిర్మృగ్; నెమరు=నిర్మృశ్; నెరయు, నెఱయు=నిర్వశ్; నెరపు, నెఱపు=నిర్వర్త్; నెరసు=నీరస.