పుట:Andhra bhasha charitramu part 1.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇచ్చట మూల అను సంస్కృత పదము దిక్కు, కోణము అనునర్థములతో దెనుగున వాడబడుచున్నది.

2. అధి=అడి-అడుపు, అడుకు, అతుకు=అధి+కృ=దగ్గఱచేరు; అలవరుచు=అధి+పత్=దగ్గఱపడునట్లుచేయు; అడిగఱ్ఱ=అధికాష్ట= దాపుగానుంచినకఱ్ఱ; అడిగొట్టు=అధికృత (అధికారులు గర్వముగలవారగుటచే గుత్సితుడనునర్థమువచ్చినది; అడియడు, అడిఅరి=అధికృత:=పనియందు నియోగింపబడినవాడు.

3. అను-అనుగు=అనుగ:=కలసివచ్చువాడు=మిత్రుడు; అనువు, అనుము=అనుగం=కలసివచ్చునది, చేరికగానుండునది, అనుపరి=అనుకారిన్=చెప్పినది చేయువాడు.

4. అప-వాడుకలో దీనిని తద్భపదేశ్యములతో గూడజేర్చి పలుకటకలదు. ఉదా అపనమ్మకము, అవవాడుక. (అవనిపతులు పలువు రపపాడి నొక్కని దన్ను బొదివికొనిన దరలక; మార్క. 8 ఆ)

ఆపు=అపహృ, పాపు=అపాస్, అపేష్, అపే; పాయగిల్లి=అపేత, అపాస్త; ఉరలు, ఒరలు, రోలు=అపసృ, అవసృ.

5. అపి-పెనయు=పినహ్, అపినహ్.

6. అవ-అవఘళించు=అవకృత, అవఘృష్ట: ఆవులించు=అవకృత; ఓరుచు=అవ+ధృ. ఓపు, ఒప్పు=అవాప్; ఒడియు=అవధృష్; అడగిల్లు=అవధృత; ఒడ్డగిలు, ఒత్తగిల్లు, ఒత్తిల్లు, ఓడిగిల్లు, ఓరగిల్లు, ఓటిల్లు, ఓహటిల్లు=అవహృత, అవహత; ఒరలు, ఉరలు, రోలు=అవసృ, అపసృ; ఊడు=అవలూ; ఊగు, ఊపు, ఊయెల, మొద. =ఉద్వహ్.

7. ఆజ్-అంచు=అజ్ఞా; అచ్చలించు=ఆచ్ఛల్; ఆరటించు=ఆరట్; అంపు, అనుపు=ఆజ్ఞాప్, అరుము, అలుము=ఆత్రం; అరయు, ఆరయు=ఆరక్ష్, ఆలక్ష్; ఆగుబ్బిలి=ఆగూర్విత; ఆవటిల్లి=ఆపతిత; దెప్పరిల్లు=ఆపతిత, ఆపన్న; అచ్చలము=ఆచ్ఛలమ్, అడియాలము=ఆధ్యాతం, (అధిద్యాతమ్?); ఆటంకము=ఆతంకము (అర్థభేదము గలిగినది);అత్తరము, ఆత్రము=ఆత్వరమ్.

8. ఉద్, - ఊకు, ఉంకు, ఉక్కు, ఉంకించు=ఉద్+కృ; ఉతుకు, ఉదుకు=ఉద్+ధావ్+కృ; ఉబుకు, ఉప్పొంగు=ఉద్+ప్లు+కృ; ఒలుకు=ఉద్+స్థా; ఊగు=ఉద్+వీజ్+కృ; ఒదుగు=ఉథ్+ధృ+కృ; ఒరగు, ఒఱగు=ఉద్+వృత్+కృ; తోచు=ఉద్+ఈ+అచ్ (ధాతువు, అస్); ఉత్తరించు=ఉత్కృ. ఉత్తృ; ఉప్పతించు=ఉత్ప