పుట:Andhra bhasha charitramu part 1.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెలగు (*చల్, శే); చెలయు (*శ్లిష్); సడలు (*షద్, శ్లథ్); జరుగు (*సృ); )డు (*హోడ్); మొద.

పై వానిలో గొన్ని సంస్కృతమందలి రూపములతోను, గొన్ని కొంచెము వికారరూపములతోను గానవచ్చుచున్నవి. సంస్కృతాంధ్రములం దొక్కటే రూపముండుటయు, నెట్టి వికారమును గలుగకుండుటయు వింతగాదు. భాషలచరిత్రమునందు కొన్ని మూలధాతువులు రూపము చెడక వచ్చుట గలదు. కొన్ని రూపములనుమార్చుకొన్నను తుదకు తొల్లింటి రూపమునే పొందుట సంభవించుచుండును. పైని వివరించిన ధాతువులు సమాన రూపములను సమానార్థములును గలవి. వానిలో గొన్ని భ్రాంతి నిరూపితములు గావచ్చును. కాని, యా భ్రాంతికి గారణము ను నిరూపింపవలసి యుండును.

పై రీతిగనే కేవల దేశ్యములని నిఘంటువున జూపబడిన ధాతువులు తద్భవములైన ట్లుత్తరహిందూస్థానభాషలతో బోల్చిన నెఱుంగనగును.

ఉదాహరణములు:-

ఉంకించు (సం. ఉద్గత, ప్రా, ఉగ్గఅ, బం. ఉగే); ఉజ్జాడు (ఝూట, *ఉఝ్ఝూడ, బం. ఉజాఱే), ఉడుకు (సం. ఉష్ణ, ప్రా. ఉణ్హ, బం. ఉనాఏ); ఉబ్బు (సం. ఊర్ధ్వ,ప్రా.ఉబ్భ; సం. ఉద్భృత, *ఉల్బిత ప్రా. ఉబ్భఅ); బం. ఉబె, ఉభే); అమయు (సం. ఊష్మ, ప్రా. ఉమ, బం. ఉమాఏ); కావు (కాకి ఆర్చుట), సం. కథయతి, ప్రా కహేఇ, బం. కహే, కయ్; కప్పు (సం. కప్, పాలి, కప్పేతి); కూడు (సం. కూట, ప్రా. కూడ, బం. కుఱాయ్; చీఱు, చీలు (సం. చీవర, ప్రా, చీఅర, బం. చిరే); తట్టు (సం. స్తబ్ధ?, ప్రా. థట్ఠ, థడ్డ, బం, ఠాటాయ్; చిలుకరించు (సం. క్షిప్, ప్రా. ఛిట్ట, బం. ఛిటాయ్); తడయు, చూ. తట్టు; తేరు (సం. స్థిర, ప్రా. ధిరాఇ, బం. థిరాయ్); సాచు (సం. పచ్, బం. పాకే); మూయు, చూ. సం. ముద్రా (*ముద్, బం. ముదే); చొక్కు, (సం శుష్క, బం. సుషాయ్; గోజు, (బం. గోజా); చఱచు (బం. చఱా); ఏగు, (బం. ఆగుఆ=ఏగో); పాడు, (బం. పారు ఆ = పేరో; మొద.